Health Tips: ఈ అలవాట్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువేనట.. అవెంటో తెలుసుకోండి..

ప్రస్తుతం వయసు, శరీర బరువుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె పోటు వస్తుంది. ముఖ్యంగా చాలా మంది యువత గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం.

Health Tips: ఈ అలవాట్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువేనట.. అవెంటో తెలుసుకోండి..
Heart Attack
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2021 | 6:56 PM

ప్రస్తుతం వయసు, శరీర బరువుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె పోటు వస్తుంది. ముఖ్యంగా చాలా మంది యువత గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం. ఎంతో ఆరోగ్యంగా ఉన్నమనిషి.. కూర్చున్నచోటే కుప్పకూలడం.. డ్యాన్స్ చేస్తూ మరణించడం కూడా చూస్తున్నాం. అలాగే ఆరోగ్యం పై.. ఫిట్‏నెస్ పై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హార్ట్ స్ట్రోక్ అటాక్ చేస్తుంది. తన ఆరోగ్యంపైనే కాకుండా.. ఫిట్‏నెస్ పై ఎంతో శ్రద్ధ వహించే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించడం అందరిని షాక్‏కు గురిచేసింది. ఎప్పుడు వ్యాయమాలు, జిమ్‏ చేస్తూ శరీరంపై శ్రద్ద పెట్టిన.. అధిక బరువు లేకున్నా.. ఎక్కువగా యువతకు గుండెపోటు వస్తుంది. అయితే గుండె కండరాలకు తగినంత రక్తం సరఫరా కానప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. రక్త ప్రవాహన్ని వీలైనంత త్వరగా పునరుద్దించడం కానీ.. అందుకు తగిన చికిత్సలు చేయడంలో ఆలస్యం అయినప్పుడు గుండె కండరాలు మరింత దెబ్బ తింటాయని వైద్యులు అంటున్నారు.

ఒక వ్యక్తికి గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయని.. కుటుంబ చరిత్ర పరంగా… వయసు పరంగా.. అలాగే.. రోజు వారీ అలవాట్లు కూడా గుండెపోటును కలిగిస్తాయి. రోజులో మనం నిత్యం చేసే అలవాట్ల పరంగానూ గుండెపోటు వచ్చే అవకాశం ఉందట. అవెంటో తెలుసుకుందామా.

1. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం. ఇంట్లో చేసిన సహజ కూరగాయలు, వంటలు కాకుండా.. ఎక్కువగా బయట లభించే వంటకాలను తినడం.. జంక్ ఫుడ్ తీసుకోవడం వలన గుండె పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందట. 2. శారీరానికి తగిన శ్రమ కల్పించకపోవడం. మారిన జీవనశైలి కారణంగా చాలా మంది శారీరానికి తగినంత శ్రమ కలిగించడం లేదు. వ్యాయమం చేయడం గుండెకు చాలా అవసరం. రోజూ ఒక గంట వ్యాయామం చేయడం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా.. రక్తపోటును నిర్వహిస్తుంది.. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 3. ఒక టంబ్లర్ వైన్ లేదా బీర్ తాగడం వలన గుండెపోటు రాకుండా నియంత్రించవచ్చు. కానీ అధికంగా మధ్యం సేవించడం వలన గుండె క్షీణిస్తుంది. 4. అధిక ఒత్తిడి కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి వలన ఆకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. డిప్రెషన్‍లో ఉంటే.. యోగా, ధ్యానం, స్నేహితులతో ఉండడం చేయాలి 5. ఎక్కువగా ధూమపానం అలవాటు ఉండడం కూడా ప్రమాదమే. ఇలాంటి వారికి గుండెపోటు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి సిగరెట్ పీల్చినప్పుడు 5,000 కంటే ఎక్కువ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వాటిలో చాలా వరకు శారీరక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఈ రసాయనాలలో ఒకటి కార్బన్ మోనాక్సైడ్. ఇది ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది మరియు గుండెను దెబ్బతీస్తుంది.

గుండెపోటు లక్షణాలు.. 1. ఛాతీ నొప్పి, 2. ఎడమవైపు తీవ్రమైన నొప్పి. 3. ఛాతీ మధ్యలో నొప్పి నిమిషం కంటే ఎక్కువగా ఉంటుంది. 4. బలహీనంగా అనిపిస్తుంది. 5. తేలికపాటి తలనొప్పి ఉంటుంది. 6. మైకం వస్తుంది. 7. దవడ, మెడ, వీపులో నొప్పి ఉంటుంది. 8. చేతులు, భూజాలలో నొప్పి ఉంటుంది. 9. శ్యాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.

Also Read: Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరి మధ్యే అసలైన పోరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..