AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనిపించని శత్రువు.. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..!

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఇది మనకు తెలియకుండానే నెమ్మదిగా శరీరంలో పేరుకుపోతుంది. కానీ కొన్ని శారీరక సంకేతాలను గమనించడం ద్వారా ఈ సమస్యను మనం ముందుగానే గుర్తించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కనిపించని శత్రువు.. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..!
Cholesterol
Prashanthi V
|

Updated on: Aug 11, 2025 | 10:29 PM

Share

మీకు తెలుసా..? గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లాంటి వాటికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ఒక మెయిన్ రీజన్. ఇది మనకు తెలియకుండానే నెమ్మదిగా శరీరంలో పేరుకుపోతుంది. కానీ కొన్ని చిన్న చిన్న సిగ్నల్స్ ద్వారా మనం దీన్ని ముందుగానే గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాళ్లలో తిమ్మిరి

నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లు చల్లగా అనిపించడం, లేదా సడెన్‌గా తిమ్మిరి రావడం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని అర్థం. ఇది రక్త ప్రసరణ సరిగా లేదని చెప్తుంది.

మతిమరుపు

చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, పని మధ్యలో ఆగిపోవడం లాంటివి మెదడు పనితీరు తగ్గిందని సూచిస్తాయి. ఇది కూడా కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ కావచ్చు.

చల్లగా చేతులు, కాళ్లు

రక్తం సరిగా ప్రవహించకపోవడం వల్ల చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా కామన్.

కళ్ల చుట్టూ తెల్ల వలయాలు

ఇలా కనిపిస్తే అది కొలెస్ట్రాల్ పెరిగినందుకు గుర్తు. యంగ్ ఏజ్‌లో ఉన్నా ఇలా కనిపిస్తే డాక్టర్‌ని కలవాలి.

పసుపు మచ్చలు

కళ్ల కింద లేదా చుట్టూ పసుపు రంగు మచ్చలు వస్తే.. మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతోందని అర్థం చేసుకోవాలి.

ఆయాసం

మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొద్దిగా నడిచినా వెంటనే ఊపిరి ఆడకపోవడం, ఆయాసం రావడం గుండెపై ఒత్తిడి పెరిగిందని సూచిస్తుంది.

రోజంతా అలసట

రాత్రి బాగా నిద్రపోయినా కూడా రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే అది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిందని అర్థం. ఎందుకంటే శరీరం ఎనర్జీ సరిగ్గా పొందలేకపోతుంది.

జాగ్రత్త

ఈ లక్షణాలు కేవలం సూచనలు మాత్రమే. వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు సరైన నిర్ధారణ కోసం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. అలాగే మీ ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలనుకుంటే.. డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)