Red Meat: రెడ్ మీట్‌ను ఇలా తింటే విషంతో సమానం.. ఆ రోగాలను ఆహ్వానించినట్టే.!
చాలామంది ప్రోస్టేట్ సమస్యలు వయసుతో వస్తాయని భావిస్తారు. కానీ వేయించిన మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్ దీనికి ప్రధాన కారణం. మూత్ర సంబంధిత ఇబ్బందులు, నొప్పి లాంటి లక్షణాలు తీవ్రమయ్యే ముందు సరైన ఆహారంతో క్యాన్సర్ లాంటి ముప్పులను నివారించవచ్చు. ఆ వివరాలు..

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు రావడం సాధారణమని చాలామంది నమ్ముతారు. అయితే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం రోజువారీ తీసుకునే ఆహారం ఈ సమస్యలకు కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రవిసర్జనలో ఇబ్బందులు, నొప్పి లాంటి లక్షణాలు తీవ్రమయ్యేవరకు చాలామంది ప్రోస్టేట్ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
ప్రోస్టేట్ సమస్యల లక్షణాలు:
ప్రోస్టేట్ గ్రంథి పాడవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిలో మూత్ర సంబంధిత ఇబ్బందులు కూడా ఉన్నాయి. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్రాశయంలో నొప్పి, లేదా మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం లాంటివి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు పెల్విక్ లేదా నడుము నొప్పి, తుంటి దగ్గర అసౌకర్యం లేదా నొప్పి లాంటివి కూడా ఈ గ్రంథి చెడిపోవడం వల్ల వచ్చే సమస్యలు. లైంగిక బలహీనత, మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి లక్షణాలు కూడా ఏర్పడవచ్చు.
ప్రోస్టేట్ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవాల్సిందే. ముఖ్యంగా అతిగా వేయించిన మాంసం, ప్రాసెస్డ్ మీట్ ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చినప్పుడు లేదా వేయించినప్పుడు, అందులో హెటిరో సైక్లిక్ అమైన్స్ లాంటి హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనాలు ప్రోస్టేట్ గ్రంథిలో వాపును కలిగించి, కణాల అసాధారణ వృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే సాసేజ్‌లు, బేకాన్ లాంటి ప్రాసెస్డ్ ఆహారాలను ఎంత త్వరగా మానేస్తే ప్రోస్టేట్ ఆరోగ్యానికి అంత మంచిది.
ప్రోస్టేట్ సమస్యలను దూరం చేయాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ సమస్యలను అడ్డుకోవచ్చు. అలాగే టమాటాలు, పుచ్చకాయ లాంటి లైకోపిన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు తగినంత నీరు తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




