Health: ఎంతకీ తగ్గని దగ్గు, జలుబు… ఈ సమస్య మీకూ ఉందా..? కొత్త గైడ్‌లైన్స్‌ జారీ చేసిన ICMR

ఈ మధ్య కాలంలో ప్రతీ ఇంట్లో జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. దగ్గు కూడా మామూలుగా ఉండటం లేదు. ఛాతీ పట్టేయడం, గొంతులో నొప్పి వీటికి అదనం. సిరప్స్‌ ఎన్ని బాటిల్స్‌ తాగినా దగ్గు మాత్రం తగ్గడం లేదు. కషాయాలూ తాను తగ్గనని దగ్గు హెచ్చరిస్తోంది. ఎంతకీ తగ్గని ఈ దగ్గు, జలుబు గురించి జనాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

Health: ఎంతకీ తగ్గని దగ్గు, జలుబు... ఈ సమస్య మీకూ ఉందా..? కొత్త గైడ్‌లైన్స్‌ జారీ చేసిన ICMR
Cold And Cough
Follow us

|

Updated on: Mar 03, 2023 | 9:06 PM

కాలం మారుతోంది, చలికాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాయి. ఇదే అదునుగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. మామూలు జలుబు, దగ్గు కూడా మనుషులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గుతో తల్లడిల్లుతున్నారు. ఎన్ని మందులు వేసుకున్నా ఈ మొండి దగ్గు పోవడం లేదు. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇండియన్ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఈ కోల్డ్‌ బగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. కొవిడ్‌ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఈ కోల్డ్‌ బగ్‌ విషయంలోనూ పాటించాలని సూచించింది.

వాతావరణంలో హఠాత్తుగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ తాకిడి తీవ్రమవుతోందని డాక్టర్లు అంటున్నారు. ఈ వైరస్‌ సామాన్యమైనది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ కారణంగా గొంతులో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, జ్వరం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే నెల రోజులు పడుతుంటే అర్థం చేసుకోవచ్చు ఈ వైరస్‌ ఎంతటి ప్రమాదకారో. సామాన్యులే కాదు డాక్టర్లు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇంజెక్షన్లు, యాంటీ బయోటిక్స్‌ ఎన్ని తీసుకున్నా ఉపశమనం కనిపించడం లేదని చాలా మంది ఆందోళన చెందుతున్న పరిస్థితి.

ఆస్పత్రుల్లోని ఔట్‌ పేషంట్స్‌ విభాగంలో రోగుల తాకిడి తీవ్రంగా ఉంటోంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణంలో హఠాత్తుగా చోటుచేసుకున్న మార్పులు, కాలుష్యంతో పాటు కొవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లడం ఈ బాధలకు కారణమని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి రోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో అధికంగా కనిపిస్తోంది. కొందరిలో స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు వృద్ధులు, బలహీనతతో బాధపడే వారిలో కనిపిస్తున్నాయి. అయితే ఇది స్వైన్‌ ఫ్లూ కాకపోవచ్చని డాక్టర్లు అంటున్నారు.

ఆస్పత్రులకు వస్తున్న వారిలో వైరల్‌ ఫీవర్‌, జలుబు, దగ్గుతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించి బ్రొంకైటిస్‌ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్లే ఎక్కువ ఉంటున్నారు. తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ఈ లక్షణాలు కొవిడ్‌ కాదని డాక్టర్లు అంటున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు కచ్చితంగా మాస్క్‌ ధరించమని చెప్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు ప్రస్తుతం అవసరమని సూచిస్తున్నారు. అవసరమైతే ఇన్‌ఫ్లూయంజా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

ఏది ఏమైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి ఇతరులకు సంక్రమించకుండా ముందుగా మిమ్మల్ని మీరు ఐసోలేట్‌ చేసుకోండి. తరచూ చేతులు కడుక్కోండి, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కోల్డ్‌ బగ్‌ను కొంత దూరం పెట్టగలం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!