Health: ఉదర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి మంచి ఫలితం ఉంటుంది..
Health: ప్రస్తుతం ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోతోంది. వృత్తి పరంగా, తీసుకునే ఆహారంలో మార్పులు రావడంతో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం కూడా..

Health: ప్రస్తుతం ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోతోంది. వృత్తి పరంగా, తీసుకునే ఆహారంలో మార్పులు రావడంతో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం కూడా ఈ సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం ద్వారా ఎదురవుతోన్న ప్రధాన సమస్య ఉదరానికి సంబంధించినవి. సరైన ఆహారం, నిద్ర లేకపోవడంతో కడుపులో వికారం, గ్యాస్, జీర్ణ సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? ఇంతకీ ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..
* ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే వారు రాగి పాత్రలోని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో ఉండే ఎన్నో గుణాలు కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యతో ఇబ్బందిపడే వారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారం వల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా తృణ ధాన్యాలు, పచ్చి కూరగాయలు, మొక్కజొన్న వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
* రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మరీ ముఖ్యంగా ప్రతీ రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* కొన్ని రకాల యోగాసనాల ద్వారా కూడా ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా త్రికోణాసనం, పశ్చిమోత్తనాసనం, పవన్ముక్తాసనం వంటి యోగాసనాలతో పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీంతో పాటు ఉదయం, రాత్రి వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
* ఇక పొట్ట సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకోవడంలో కూడా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకోకుండా.. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై పొట్ట ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది.
AP Weather: వెదర్ అప్‌డేట్.. ఏపీకి పొంచి ఉన్న మరో గండం
Andhra Pradesh: ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి..




