Coffee: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ? అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. ఏంటంటే..

కాఫీ.. ఒత్తిడి తగ్గించి మనసును ప్రశాంతగా ఉంచే దివ్యౌషధం. ఛాయ్, కాఫీ ప్రియులు చాలా మందే ఉంటారు. రోజులో ఒకటి, రెండు

Coffee: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ? అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. ఏంటంటే..
Coffee
Follow us

|

Updated on: Nov 20, 2021 | 4:13 PM

కాఫీ.. ఒత్తిడి తగ్గించి మనసును ప్రశాంతగా ఉంచే దివ్యౌషధం. ఛాయ్, కాఫీ ప్రియులు చాలా మందే ఉంటారు. రోజులో ఒకటి, రెండు కంటే ఎక్కువ సార్లు కాఫీ తాగేవారున్నారు. కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కాఫీ తాగితే అనేక సమస్యలు వస్తాయనే అపోహా కూడా లేకపోలేదు. ఇందులో కెఫిన్ రిచ్ వలన కాఫీ తీసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు ఉంటాయి. ఇటీవల జరిగిన అధ్యయనంలో కాఫీ గురించి షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. అవెంటో తెలుసుకుందామా.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క సైంటిఫిక్ సెషన్స్ 2021లో సమర్పించబడిన ఈ కొత్త అధ్యయనం ప్రకారం.. నవంబర్ 13-15 వరకు వర్చువల్ నిర్వహించారు. కాఫీ తాగడం వలన గుండె కొట్టుకోవడం పెరుగుతుందని.. అలాగే శారీరక శ్రమ వేగవంతం అవుతుందని తెలిపారు. అలాగే నిద్ర సమయం కూడా తగ్గుతుంది. కాఫీ తీసుకునే విషయంలో సమతుల్యత.. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని ఇటీవల అధ్యయనంలో తేలీంది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన పరిశోధనలో కార్డియాలజిస్ట్, శాన్ ఫ్రాన్సిస్కో గ్రెగోరీ మార్కస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులు ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పటివరకు కాఫీ గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. తాజాగా 100 మీద నిర్వహించిన అధ్యయంలో వారి గుండె కొట్టుకోవడాన్ని ట్రాక్ చేయగలిగేలా ఈసీజీ పరికరాన్ని రోజూ ధరించమని అడిగాము. దీంతోపాటు.. వారి శారీరక శ్రమ, నిద్రను కూడా చెక్ చేయడానికి మణికట్టుపై ధరించారని తెలిపారు. దాదాపు రెండు వారాలపాటు.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ట్రాక్ చేశాము. అలాగే వారి లాలాజలం నుంచి డీఎన్ఎ నమునాలను కూడా చెక్ చేశాము. ఈ పరీక్షల అనంతరం వారు రోజులో కాఫీ రెండు సార్లకు మించి తీసుకోవద్దని సూచించినట్లు తెలిపారు.

కాఫీ తాగడం వలన అకాల వెంట్రిక్యూలర్ సంకోచాలు 54 పెరుగుతాయని తెలీంది. అంటే గుండె స్పందన వేగం పెరుగుతుంది. కానీ నిద్రలేమి సమస్య పెరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తాగని వారి కంటే తాగే వారు దాదాపు 1000 అడుగులు ఎక్కువగా నడుస్తారు. కాఫీ తాగేవారు రాత్రి పూట 36 నిమిషాలు తక్కువగా నిద్రపోతారు. ఒక కప్పు కాఫీ కంటే..ఎక్కువ తాగే వారి గుండె వేగం పెరుగుతుంది. ఒక్కో కప్పు కాఫీకి దాదాపు 600 అడుగులు ఎక్కువగా నడిచి.. రాత్రికి 18 నిమిషాలు తక్కువగా నిద్రపోతారు. కాఫీ తాగడం కంటే ఎక్కువ శారీరక శ్రమ వల్ల టైప్ 2 డయాబెటిస్ మరియు అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నిద్ర లేకపోవడం వల్ల, మానసిక, నాడీ, గుండె మరియు ప్రేగులకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి.

Also Read: Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‏తో విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. త్వరలోనే షూటింగ్ అంటూ..