Monkeypox Vaccine: మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్.. జపాన్ ఆమోదించిన మందు అదే.. ప్రభావం ఎంతంటే..
Monkeypox Vaccine: కరోనా స్థాయిలో ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ వచ్చేసింది. అవును.. మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు మశూచీ టీకాను వాడేందుకు జపాన్ వైద్య ఆరోగ్య శాఖ అనుమతించింది.
Monkeypox Virus Vaccine: కరోనా స్థాయిలో ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ వచ్చేసింది. అవును.. మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు మశూచీ టీకాను వాడేందుకు జపాన్ వైద్య ఆరోగ్య శాఖ అనుమతించింది. మంకీపాక్స్ లక్షణాలున్న వారిలో 85 శాతం ప్రభావ వంతంగా స్మాల్ ఫాక్స్ టీకా పనిచేస్తోందని జపాన్ ప్రకటించింది. గత జులైలో ఈవ్యాధి లక్షణాలున్న ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించిన తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా మంకీపాక్స్ నివారణకు మచూశీ టీకా పనిచేస్తోందని కన్ఫర్మ్ చేసింది. స్మాల్ ఫాక్స్ టీకా తీసుకున్న 30 ఏళ్ల వయస్సున ఇద్దరు విదేశాలకు వేళ్లారు. ఈవైరస్ వ్యాప్తి చెందకుండా జపాన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను సూచించింది.
మంకీపాక్స్ చికిత్స కోసం జపాన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెకోవిరిమాట్ అనే ఔషధాన్ని పరిశీలిస్తోంది. ఇది మశూచికి చికిత్స చేయడానికి ఉపయోగించే నోటి మందని ఓ వార్తా సంస్థ తెలిపింది. సన్నిహిత శారీరక సంబంధం ద్వారా వ్యాపించే ఉష్ణమండల వ్యాధి యొక్క లక్షణాలు మశూచి మాదిరిగానే ఉంటాయని…జ్వరం, దద్దుర్లు, చర్మ గాయాలు వంటి లక్షణాలుంటాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జపాన్ లో మంకీపాక్స్ కేసులను నివారించడంపైనే ప్రధానంగా దృష్టిసారించామని… తమకు స్మాల్ పాక్స్ టీకాలు వేయాలని ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారని..ఈఅంశం పరిశీలనలో ఉందని జపాన్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదిలా ఉండగా భారత్ లోనూ మంకీ పాక్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే 9 కేసులు నమోదు కాగా.. వీరిలో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం మంకీపాక్స్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు మంకీపాక్స్ కు సరైన టీకాను కనుగొనడానికి అధ్యయనాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..