Skin Care Tips: మీ ఫేస్ అందంగా, హెల్దీగా ఉండాలా.. అయితే మీ పిల్లో కవర్స్ ని వారానికి మార్చాల్సిందే!

| Edited By: Ram Naramaneni

Oct 11, 2023 | 9:39 PM

మీ ఫేస్ అందంగా ఉండాలంటే కేవలం ఖరీదైన క్రీములు, మాయిశ్చ రైజర్లు, క్లెన్సర్లు వాడితే సరిపోదు. దానికి తగినట్టుగా మీ ఇంట్లో, ఒంట్లో కూడా మార్పులు ఉండాలి. మనం ఏం తీసుకుంటామో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ మన బాడీపై ఖచ్చితంగా పడతాయి. మీరు జంక్ ఫుడ్ ని తీసుకుంటే దాని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, చర్మంలో ముడతలు రావడం, గ్లో లేకుండా పాలిపోయి ఉండం వంటివి కనిపిస్తాయి. అదే మీరు ఉదయం వ్యాయామం చేస్తూ సరైన డైట్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందంగా కూడా మనం సొంతం అవుతుంది. ఈ విషయం పక్కకు పెడితే.. ముఖ్యంగా మనం ముఖం పింపుల్స్, దురద..

Skin Care Tips: మీ ఫేస్ అందంగా, హెల్దీగా ఉండాలా.. అయితే మీ పిల్లో కవర్స్ ని వారానికి మార్చాల్సిందే!
Pillow
Follow us on

మీ ఫేస్ అందంగా ఉండాలంటే కేవలం ఖరీదైన క్రీములు, మాయిశ్చ రైజర్లు, క్లెన్సర్లు వాడితే సరిపోదు. దానికి తగినట్టుగా మీ ఇంట్లో, ఒంట్లో కూడా మార్పులు ఉండాలి. మనం ఏం తీసుకుంటామో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ మన బాడీపై ఖచ్చితంగా పడతాయి. మీరు జంక్ ఫుడ్ ని తీసుకుంటే దాని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, చర్మంలో ముడతలు రావడం, గ్లో లేకుండా పాలిపోయి ఉండం వంటివి కనిపిస్తాయి. అదే మీరు ఉదయం వ్యాయామం చేస్తూ సరైన డైట్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందంగా కూడా మనం సొంతం అవుతుంది. ఈ విషయం పక్కకు పెడితే.. ముఖ్యంగా మనం ముఖం పింపుల్స్, దురద వంటివి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం పడుకునే బెడ్ కూడా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లో కవర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంగా మనం నిద్రపోయేది ఆ పిల్లో కవర్స్ మీదనే. రాత్రంతా ముఖం దిండుపైనే ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో మాత్రం చర్మం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లో కవర్స్ ని వారానికోసారి శుభ్ర పరుస్తూ ఉండాలి. ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

దుమ్ము, ధూళి చేరే అవకాశం:

మనం ఎంత శుభ్ర పరిచినా.. రోజూ ఎంతో కొంత దుమ్ము, ధూళి పిల్లో కవర్స్ చేరుతూనే ఉంటుంది. అంతే కాకుండా చాలా మంది నైట్ నూనె రాసుకుని పడుకుంటారు. ఈ నూనె అంతా పిల్లో కవర్స్ కి అంటుకుని ఉంటుంది. అంతేకాకుండా నైట్ మనం రాసే క్రీములు, లోషన్స్ కూడా దిండుకు చేరుతాయి. ఇలాంటి పనుల వలన ముఖంపై పింపుల్స్ లేదా చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దిండు క్లాత్స్ ను అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెర్స్:

చాలా మంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వలన చర్మ రంధ్రాలకు సమస్యగా ఉంటుంది. స్కిన్ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం కూడా ఉంది.

మీరు ఎంచుకున్న ఫాబ్రిక్:

మీరు ఉపయోగిస్తున్న ఫాబ్రిక్ రకాన్ని బట్టి కూడా పలు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కాటన్ వంటి ఫాబ్రిక్ ను యూజన్ చేయడం వల్ల జుట్టు చివర్లు విరిగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి మంచి ఫాబ్రిక్ ను ఎంచుకోవాలి.

బ్యాక్టీరియా చేరుతుంది.. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది:

పిల్లో కవర్స్, బెడ్ పై దుమ్ము, ధూళి, నూనెలు వంటివి చేరడం వల్ల బ్యాక్టీరియా పెరిగేందుకు దారి తీస్తుంది. దీంతో కేవలం చర్మ సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాగా పలు అధ్యయనాల వల్ల పిల్లో కవర్స్ పై ఉండే బ్యాక్టీరియా.. బాడీలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.