AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Long Hours Sitting: అదే పనిగా కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త.. మీకు గుండె పోటు వచ్చే అవకాశం ఉంది..

Sitting Too Much Is Bad For Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా చేసే పనుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చోక్కా నలగకుండా..

Long Hours Sitting: అదే పనిగా కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త.. మీకు గుండె పోటు వచ్చే అవకాశం ఉంది..
Narender Vaitla
|

Updated on: Feb 23, 2021 | 2:13 PM

Share

Sitting Too Much Is Bad For Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా చేసే పనుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చోక్కా నలగకుండా రూ. లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఈ రూపాయల వెనక ఎంతో ప్రమాదం పొంది ఉందని మీకు తెలుసా.? రోజుకు ఏకధాటిగా 12 గంటలు కూర్చుని పనిచేసే వారు ఇటీవల బాగా పెరిగిపోయారు. పని సంస్కృతి అలా మారడం దీనికి ప్రధాన కారణం. అయితే కదలకుండా అదే పనిగా కూర్చుంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్లు అని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఒకే చోట కదలకుండా గంటల కొద్దీ కూర్చుని పనిచేస్తే ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని మయో మెడికల్‌ రీసర్చ్‌ టీమ్‌ చెబుతోంది. రోచెస్టర్‌, మిన్నెసోటాకు చెందిన పరిశోధకులు చేసిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. రెండు గంటల పాటు అదేపనిగా కూర్చొని ఉంటే.. మనం 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల పొందిన ఆరోగ్యాన్ని నష్టపోతామని చెబుతున్నారు. ఇందుకోసం ఈ పరిశోధన బృందం ఒకే చోట కూర్చుని పనిచేసే రెండు వేలకు పైగా ఉద్యోగులను పరిగణలోకి తీసుకున్నారు. వీరికి పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత శాస్ర్తవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేవకుండా పనిచేసే వారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కుర్చీకి పరిమితం కాకుండా కాసేపు అలా.. అటు ఇటు నడవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Also Read: Benefits Of Potatoes: బంగాళాదుంపలు నోటి క్యాన్సర్ వంటి ఎన్నో వ్యాధులకు ఔషధం.. తినడం తిరస్కరించవద్దు.. అయితే…