AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Frustration: పిల్లల పెంపకంలో ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్.. వీటి నుంచి బయటపడటానికి సింపుల్ టిప్స్ మీకోసం..!

పిల్లలను పెంచడం అనేది సంతోషంగా సాగాల్సిన ప్రయాణం. కానీ చాలా మంది తల్లిదండ్రులకు ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్ వంటివి సర్వసాధారణంగా మారాయి. అయితే సరైన పద్ధతులు పాటిస్తే ఈ ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పేరెంటింగ్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు, దాని లక్షణాలు, జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Parenting Frustration: పిల్లల పెంపకంలో ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్.. వీటి నుంచి బయటపడటానికి సింపుల్ టిప్స్ మీకోసం..!
Parenting Frustration
Prashanthi V
|

Updated on: Aug 05, 2025 | 6:09 PM

Share

పిల్లల పెంపకంలో మీరు స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ జర్నీలో ఒత్తిడి అనేది చాలా కామన్. కానీ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే.. మీరు హ్యాపీగా ఉండటమే కాకుండా మీ పిల్లలకు మంచి రోల్‌ మోడల్‌గా మారొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మానసిక ఆరోగ్యమే ఫస్ట్‌ ప్రయారిటీ

స్ట్రెస్‌కి సంబంధించి ఏ చిన్న సింప్టమ్స్ కనిపించినా.. విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఉంటే వెంటనే ఎక్స్‌పర్ట్‌ని కలవండి. ప్రాబ్లమ్ పెద్దదయ్యేలోపే స్టార్టింగ్‌లోనే దానికి అటెన్షన్ ఇస్తే మెంటల్ హెల్త్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

శారీరక, మానసిక ఆరోగ్యంపై ఫోకస్ పెట్టండి

పేరెంట్స్‌గా మనం పిల్లల గురించే ఆలోచిస్తూ మన గురించి పట్టించుకోం. కానీ ఎక్సర్‌సైజ్, హెల్తీ ఫుడ్, మంచి నిద్ర మన హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. మీరు ఫిట్‌గా ఉంటేనే.. పిల్లల పెంపకాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు.

పిల్లలతో ఓపికగా కనెక్ట్ అవ్వండి

పిల్లల ఫీలింగ్స్, ఎమోషన్స్‌ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చెబుతున్నారో కేర్ఫుల్‌గా వినండి. మీ వల్ల పొరపాటు జరిగితే.. సారీ చెప్పడానికి అస్సలు సిగ్గుపడొద్దు. ఇది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది.

వాస్తవానికి దగ్గరగా ఉండండి

పిల్లలు అన్నింటి లోనూ నంబర్ వన్ గా ఉండాలని పేరెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే.. అది వాళ్ళపై, మీపై ఒత్తిడిని పెంచుతుంది. ప్రతి చిన్నారికి ఓన్ స్టైల్, ఓన్ టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని వాళ్ళని ఫ్రీగా ఎదగనివ్వండి.

ఒత్తిడిని పెంచే వాటికి దూరంగా..

అనవసరమైన ఎక్స్‌పెక్టేషన్స్, భయాల వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ లాంటివి రోజు కొద్దిసేపు చేస్తే మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి టిప్స్

  • మీ పార్ట్‌నర్‌తో క్వాలిటీ టైమ్ గడపండి.
  • పిల్లల విషయంలో కూల్‌గా ఉండండి.
  • పిల్లల స్క్రీన్ టైమ్‌ని కంట్రోల్ చేయండి.
  • మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయండి.
  • మంచి నిద్రకు ఇంపార్టెన్స్ ఇవ్వండి.
  • యోగా చేయండి.
  • ఇతర పేరెంట్స్‌తో మాట్లాడి, మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి.

ఈ సింప్టమ్స్ ఉంటే జాగ్రత్త

  • ఎప్పుడూ తలనొప్పి రావడం
  • జీర్ణ సమస్యలు
  • ఎనర్జీ లేనట్లుగా అనిపించడం, ఫ్రస్ట్రేషన్
  • ఏకాగ్రత కోల్పోవడం
  • మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం
  • జలుబు, దగ్గు లాంటివి తరచూ రావడం
  • పై సింప్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటే.. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్.