AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. ఇప్పుడే జాగ్రత్త పడండి గురూ..

కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి.. దీని పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం, కొవ్వును ఆదా చేయడం, మురికిని తొలగించడం వంటి ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, కాలేయ వ్యాధి విషయంలో శరీరం సరిగ్గా పనిచేయదు.. తీవ్రమైన వ్యాధులకు గురవుతుంది.

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. ఇప్పుడే జాగ్రత్త పడండి గురూ..
Fatty Liver Disease
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2024 | 4:45 PM

Share

కాలేయంలో (ఫ్యాటీ లివర్) కొవ్వు పేరుకుపోవడం అనేక తీవ్రమైన వ్యాధుల ప్రారంభానికి సంకేతం. కొవ్వు కాలేయ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి.. మొదటిది అధికంగా మద్యపానం వల్ల వస్తుంది – ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.. రెండవది చెడు జీవనశైలి, ఊబకాయం, మధుమేహం వస్తుంది- నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కారణంగా వస్తుంది. కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి.. దీని పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం, కొవ్వును ఆదా చేయడం, మురికిని తొలగించడం వంటి ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, కాలేయ వ్యాధి విషయంలో శరీరం సరిగ్గా పనిచేయదు.. తీవ్రమైన వ్యాధులకు గురవుతుంది. పెరుగుతున్న దశలో ఫ్యాటీ లివర్ కూడా క్యాన్సర్, సిర్రోసిస్, నష్టాన్ని కలిగిస్తుంది.. ఈ లక్షణాల ద్వారా మీరు ఫ్యాటీ లివర్ డేంజర్ దశను గుర్తించవచ్చు.. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది తీవ్రమైన వ్యాధి, ఇది సిర్రోసిస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. దీనిని శరీరంలోని కొన్ని భాగాలలో వాపు సంకేతాలను గమనించవచ్చు.. ఎక్కడెక్కడ వాపు ఉంటే అలర్ట్ కావాలో తెలుసుకోండి..

ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతున్న సంకేతాలు

పాదాలు – చీలమండలలో వాపు: కొవ్వు కాలేయ వ్యాధితో సంబంధం ఉన్న కాలేయం దెబ్బతినడం వల్ల పాదాల చుట్టూ ఉన్న కణజాలాలలో ద్రవం పేరుకుపోతుంది, ఫలితంగా వాపు వస్తుంది.

కడుపులో వాపు: అధునాతన కాలేయ వ్యాధిలో కడుపులో నీరు చేరడం ప్రారంభమవుతుంది. ఇది అపానవాయువు సమస్యను కలిగిస్తుంది. దీనిని సిర్రోసిస్, క్యాన్సర్ అని కూడా అంటారు.

అరికాళ్ళలో వాపు: ఎవరైనా తీవ్రమైన ఫ్యాటీ లివర్ వ్యాధిని కలిగి ఉన్నప్పుడు పాదాలు, చీలమండల వాపుతో పాటు.. అరికాళ్ళలో ఎడెమా లాంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. ఇది కాకుండా, తీవ్రమైన అనారోగ్యంలో ముఖం, చేతుల్లో వాపు ఉండవచ్చు.

ఫ్యాటీ లివర్‌ను నియంత్రించే మార్గాలు..

  • మీరు కొవ్వు కాలేయం తీవ్రమైన పరిణామాలను నివారించాలనుకుంటే, మీ బరువును నియంత్రించండి.
  • ఇందుకోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
  • తక్కువ కొవ్వు ఆహారం తీసుకోండి.
  • కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్స్ (వైట్ రైస్, బంగాళాదుంపలు, వైట్ బ్రెడ్) తగ్గించండి.
  • ఫ్రక్టోజ్ అధికంగా ఉండే చాలా రసాలు, కార్బోనేటేడ్ పానీయాలను తాగకుండా ఉండండి.
  • మద్యం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..