Spring Season Fruits: వసంత రుతువులో లభించే ఈ సీజనల్ ఫ్రూట్స్‌తో ఇమ్యూనిటీతో పాటు బరువు తగ్గించుకోవచ్చు..!!
వేసవి ఆరంభానికి సూచికంగా వచ్చే వసంత రుతువులో ఎన్నో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతాయి. కాబట్టి ఈ కాలంలో లభించే పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు.

ఉగాదితో వసంత రుతువు షురూ అవుతుంది. చలికాలం ముగిసి వేసవి కాలం వస్తుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పగలు చల్లగా…రాత్రి వేడిగా ఉంటుంది. శీతాకాలంలో వాడిన ఉన్ని దుస్తువులను పక్కన పెట్టి…తేలికబట్టలను తీసే సమయం ఇది. ఈ సమయంలో వాతావరణం అనూహ్యంగా మారుతుంది. వాతావరణంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీంతో సాధారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు వస్తాి. అలెర్జీ కారకాలు వైరస్ లు సీజన్ మారుతున్నా కొద్దీ దాడి చేస్తుంటాయి. కాబట్టి మీ ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఐదు రకాల సీజనల్ పండ్లు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచే పండ్లు ఏవో తెలుసుకుందాం.
1. చెర్రీస్:
చెర్రీస్ లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని సమస్యలన్నింటిని తొలగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంతోపాటు గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. చెర్రీ పండ్లలో విటమిన్ సి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనస్సును రికాల్స్ ఉంచడంతోపాటు నిద్రను పెంచుతాయి. అంతేకాదు రక్తంలోని యూరిస్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
2. స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీలు వసంతకాలంలో పక్వానికి వస్తాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాను నివారించడంతోపాటు అంధత్వాన్ని దూరం చేస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ సి ఫ్రీరాడికల్స్ నుంచి కళ్లను కాపాడుతాయి. బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి. వీటిని సలాడ్స్ కానీ జామ్ లేదా, జెల్లీ రూపంలో తీసుకోవచ్చు.




3. బ్లాక్ బెర్రీస్ :
బ్లాక్ బెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో విటమిన్ సి, కె, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ మొత్తంలో కెలరీలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. వీటిని స్మూతీ లేదా వోట్ పాన్ కేక్ వాటిల్లో ఉపయోగించవచ్చు.
4. నారింజ:
నారింజ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తహీనతతో పోరాడటానికి ఐరన్ గ్రహించడంలో సహాయపడతాయి. అంతేకాదు మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. నారింజను జ్యూస్ రూపంలో కానీ డైరెక్టుగా తినవచ్చు.
5. బొప్పాయి:
బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు బరువు తగ్గడంలోనూ సహాయపడతుంది. దీన్ని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



