AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypertension: అధిక రక్తపోటును గుర్తించండి ఇలా.. ఈలక్షణాలుంటే మీరూ బాధితులు కావచ్చు..

వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు అనేది ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారింది. దీనినే హైపర్ టెన్షన్ అని అంటారు. అధిక రక్తపోటు వచ్చినా..

Hypertension: అధిక రక్తపోటును గుర్తించండి ఇలా.. ఈలక్షణాలుంటే మీరూ బాధితులు కావచ్చు..
Hypertenssion
Amarnadh Daneti
|

Updated on: Aug 28, 2022 | 4:08 PM

Share

Hypertension: వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు అనేది ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారింది. దీనినే హైపర్ టెన్షన్ అని అంటారు. అధిక రక్తపోటు వచ్చినా ఒక్కోసారి అది వచ్చినట్లు మనకు తెలియదు అంటున్నారు నిపుణులు. అధికరక్తపోటు లక్షణాలు త్వరగా బయటపడవు అంటున్నారు వైద్య నిపుణులు. అధిక రక్తపోటును గుర్తించడానికి వైద్య నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం..అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ ఈరెండూ ఒకటే.. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో మూడింట ఒకవంతు మందికి దాని గురించి తెలిసే అవకాశం లేదు. అధిక రక్తపోటు చాలా తీవ్రంగా ఉంటేనే దీని లక్షణాలు బయటపడతాయి. మనకు రక్తపోటు ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యులతో చెకప్ చేయించుకోవడం సరైన మార్గం. అలాగే అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

అధిక రక్తపోటు ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ రక్తపోటు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు క్రింది లక్షణాలు కనిపిస్తాయి. ఈలక్షణాలు ఎక్కువుగా ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

తీవ్రమైన తలనొప్పి

ఇవి కూడా చదవండి

ముక్కుదిబ్బడ

అలసట లేదా ఆందోళన

దృష్టి లోపం

ఛాతి నొప్పి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మూత్రంలో రక్తం

ఛాతీ, మెడ లేదా చెవుల్లో నరాలు కొట్టుకోవడం

నిద్ర పట్టడంలో ఇబ్బంది

పై లక్షణాలు ఉంటే అవి అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. అలాగే అధిక రక్తపోటు ధమని గోడలపై రక్తం శక్తి చాలా ఎక్కువయ్యేలా చేస్తుంది. గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తే.. ధమనులు ఇరుకైనవిగా మారిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల రక్తపోటు పెరుగుతుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు బయటపడవు. అయితే తరచూ తలనొప్పి, మైకముతో బాధపడుతూ ఉంటే లేదా త్వరగా అలసిపోతుంటే అధిక రక్తపోటు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..