Raw Egg: పచ్చిగుడ్డుని రెగ్యులర్‌గా తాగుతున్నారా.. అయితే మీ శరీరతత్వానికి సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి..
Uncooked Egg: గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం. అయితే కొంతమంది గుడ్డుని ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని..
Uncooked Egg: గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం. అయితే కొంతమంది గుడ్డుని ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. అవును కొంటామని కోడిగుడ్డుని పచ్చిగా కొట్టేసుకొని త్రాగేస్తూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో ఉంది. దానికి పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
కోడి గుడ్డుని పచ్చిగా అలాగే కొట్టుకుని త్రాగవచ్చు అయితే ఒకవిషయం గుర్తు పెట్టుకోవాలి. కోడిగుడ్లతో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. అలా కోడిగుడ్డుని ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే పచ్చిగా త్రాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. కోడిగుడ్డుతో ఈ బ్యాక్టీరియా స్వల్ప మోతాదులో ఉంటుంది. కనుక ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎటువంటి హాని కలగదు.అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్‌ఫెక్షన్లు, జ్వరం వస్తాయి.పచ్చి గుడ్డులోని తెల్లటి భాగంలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
అంతేకాదు ఆరోగ్యంగా లేని వ్యక్తులు కూడా పచ్చి కోడి గుడ్డుని రోజూ తాగకూడదు. ఏమైనా వ్యాధులున్నవారు పచ్చి కోడి గుడ్డుని రెగ్యులర్ గా తీసుకుంటే బయోటిన్ అనే పోషక లోపం ఏర్పడుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయోటిన్ లోపాన్ని విటమిన్ బి 7 అని కూడా అంటారు. ఈ లోపం ఏర్పడితే.. చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమందికి పచ్చి గుడ్డులోని తెల్లసొన అలర్జీని కలిగించే అవకాశం ఉంది. శరీరంలో దద్దుర్లు, వాపు, చర్మం ఎర్రబడటం, తిమ్మిరి, విరేచనాలు, దురద, కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు గుడ్డులోని తెల్లసొన కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. బీపీలో హెచ్చితగ్గులు ఏర్పడతాయి. ఒకొక్కసారి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు కూడా అనిపిస్తుంది. కనుక కోడిగుడ్డు పచ్చిగా తాగాలనుకునే వారు తమ శరీర తత్వానికి సరిపడుతుందా లేదా అని చూసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు.
Also Read: Jagtial: తాను నాటిన చెట్టుని కొట్టేశారంటూ ఓ వ్యక్తి నిరసన.. చెట్టును కొట్టిన వ్యక్తికి ఐదు వేలు ఫైన్ వేసిన అధికారులు..
రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. రిపేర్ చేయించండని సీఎం జగన్‌కు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు