మైగ్రైన్ తలనొప్పి..భరించలేని అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా అర గంట, గంట పాటు తలనొప్పి వస్తేనే తెగ ఇబ్బంది పడిపోతుంటారు. అయితే మైగ్రేన్ గంటలతో మొదలై రోజుల వరకు ఇబ్బంది పెడుతుంది. ట్యాబ్లెట్లతో సాధారణ తలనొప్పిని దూరం చేసుకోవచ్చు కానీ మైగ్రేన్‌ను కాదు. ఇక ఈ తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు, వికారం, అలసట, చూపు మసకబారడం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొందరైతే వాసన, రుచి చూసే సామర్థ్యం కూడా కోల్పోతారు. ఈనేపథ్యంలో కొన్ని ఇంటి చిట్కాలతో మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులకు ఎండుద్రాక్ష చాలా మేలు చేస్తుందంటున్నారు.
మైగ్రేన్ వల్ల కలిగే తలనొప్పిని పోగొట్టడంలో ఎండు ద్రాక్ష సమర్థంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఐరన్, పిండి పదార్థాలు, కాల్షియం, ఫైబర్, పొటాషియం, కాపర్, విటమిన్ బి6, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మైగ్రేన్ తలెత్తినప్పుడు ఎండుద్రాక్ష తినడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. క్రమంగా దాని తీవ్రతను కూడా తగ్గిస్తుంది.వీటితో పాటు ఎండు ద్రాక్షలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం తగ్గిపోతుంది. అలాగే ఇందులోని పోషకాలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తపోటు బాధితులకు ఇది మంచి ఆహారమని నిపుణులు సూచిస్తారు. ఇక కంటి సమస్యలున్న వారు రోజూ ఎండుద్రాక్ష తినడం మంచిదట. ఇందులోని మినరల్స్ కంటి చూపు పెరగడానికి సహాయపడతాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..