Presvu Eye Drop: ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా.?
ప్రతి ఒక్కరికి కళ్లు ప్రధానమైనవి. కళ్లు లేకుంటే ప్రపంచమే చీకటిమయం అవుతుంది. అందుకు కళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కంటికి చిన్నపాటి సమస్య తలెత్తినా తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కంటి సమస్యలకు రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి...
ప్రతి ఒక్కరికి కళ్లు ప్రధానమైనవి. కళ్లు లేకుంటే ప్రపంచమే చీకటిమయం అవుతుంది. అందుకు కళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. కంటికి చిన్నపాటి సమస్య తలెత్తినా తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కంటి సమస్యలకు రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కంటి సమస్యలకు రకరకాల ఐడ్రాప్స్ ఉన్నప్పటికీ.. భారతీయ ఔషధాల తయారీ సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ అటువంటి ఐ డ్రాప్‌ను తయారు చేసింది. ఈ డ్రాప్ వేయడం ద్వారా సమీపంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారు.
అయితే కంటి చూపు సమస్య ఉన్న వారు ఈ డ్రాప్ వేసుకున్నట్లయితే చాలా సమయం వరకు కంటి అద్దాలను ధరించకుండా ఉండగలుగుతారు. ఈ డ్రాప్ పేరు ప్రెస్వు ఐ డ్రాప్ Presvu Eye Drop). ఈ ఐ డ్రాప్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం కూడా లభించింది. అయితే ఈ డ్రాప్ వేసుకోవడం వల్ల అద్దాలను శాశ్వతంగా తొలగించలేమని నిపుణులు అంటున్నారు.
270 మంది రోగులపై ఫేజ్ 3 క్లినికల్ స్టడీ నుండి డేటాను సమర్పించిన తర్వాత ఈ ఔషధం నిపుణుల కమిటీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుండి ఆమోదం పొందింది. ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిక్కిల్ కె మసుర్కర్ మాట్లాడుతూ.. ఈ ఔషధం అక్టోబర్‌లో అందుబాటులోకి వస్తుందని, అలాగే ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషధంగా ఉంటుందని చెప్పారు.
ఈ ఐడ్రాప్ చుక్కలను కళ్లలో వేసుకుంటే కళ్లు దాదాపు 6 గంటలపాటు పని చేస్తుందట. ఈ డ్రాప్స్ కారణంగా దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారని వైద్యుడు తుషార్ చెప్పారు. అద్దాలకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న వారు, అద్దాలు ధరించకుండా ఉండాలంటే ప్రతి 6 గంటలకు ఒకసారి కళ్లలో ఈ చుక్కలు వేయాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక పరిష్కారం కాదు: నిపుణులు
ఔషధం ఒక చుక్క కేవలం 15 నిమిషాల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు. దాని ప్రభావం తదుపరి ఆరు గంటల వరకు ఉంటుంది. మొదటి చుక్క వేసిన మూడు నుండి ఆరు గంటలలోపు రెండవ చుక్కను కూడా వేస్తే దాని ప్రభావం తొమ్మిది గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు.
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్ నుండి డాక్టర్ రోహిత్ సక్సేనా ప్రకారం.. చుక్కలు స్వల్పకాలికానికి మంచివి కానీ దీర్ఘకాలికంగా పరిష్కారాన్ని అందించలేవు. ఈ ఐ డ్రాప్స్ ప్రభావం 4-6 గంటల పాటు ఉంటుంది. రోజుకు 1-2 సార్లు చుక్కలు అవసరం కాబట్టి ఇది రీడింగ్ సమస్యలకు తాత్కాలిక పరిష్కారం అని ఆయన తెలిపారు.
అస్పష్టమైన దూర దృష్టి, తలనొప్పి, అరుదుగా రెటీనా వంటి కొన్ని దుష్ప్రభావాలు ఔషధంతో సంబంధం కలిగి ఉన్నందున ఈ ఐడ్రాప్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి