Pregnant Health Care: గర్భధారణ సమయంలో ఒత్తిడి స్త్రీ, పుట్టబోయే బిడ్డకు పెను ప్రమాదం.. ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలంటే..!

|

Dec 23, 2021 | 11:46 AM

Pregnant Health Care: ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు వారి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు.

Pregnant Health Care: గర్భధారణ సమయంలో ఒత్తిడి స్త్రీ, పుట్టబోయే బిడ్డకు పెను ప్రమాదం.. ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలంటే..!
Pregnant
Follow us on

Pregnant Health Care: ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు వారి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఒత్తిడి, మానసిక కల్లోలం వంటి సమస్యలు కూడా గర్భిణీ స్త్రేలను వేధిస్తుంటాయి. ఒత్తిడికి సాధారణ కారణం శరీరంలోని హార్మోన్ల మార్పుగా పరిగణించబడుతుంది. కానీ, చాలా మంది గర్భిణీ స్త్రీలు.. ప్రసవ వేదన, బిడ్డను ప్రసవించే సమయంలో ఎలా చూసుకోవాలి వంటి విషయాలపై అతిగా ఆలోచిస్తారు. దీని కారణంగా వారిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, గర్భిణీ స్త్రీ ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇల్లు, ఆఫీసు మధ్య సమతుల్యం గురించి వారిపై ఒత్తిడి ఉంటుంది. కారణం ఏమైనప్పటికీ ఒత్తిడి తల్లి, బిడ్డ ఇద్దరిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి వల్ల కలిగే నష్టాలు, దానిని నివారించే మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం..

అధిక ఒత్తిడి గర్భస్రావానికి కలిగిస్తుంది..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒత్తిడి కారణంగా గర్భధారణలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు, అధిక ఒత్తిడి కారణంగా మహిళల్లో బీపీ పెరుగుతుంది. దాని కారణంగా గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా, ప్రీ-మెచ్యూర్ డెలివరీ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఒత్తిడికి గురవడం వలన స్త్రీ నిద్రకు భంగం కలుగుతుంది. ఆకలి అనిపించదు. ఇది పిల్లల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక ఒత్తిడికి లోనయ్యే మహిళల, పిల్లల రోగనిరోధక శక్తి.. ఇతర పిల్లల కంటే బలహీనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి పిల్లల స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా, కోపం, చిరాకు, ఒత్తిడిని తీసుకునే అలవాటు పిల్లల స్వభావంలో పెరుగుతంది.

ఒత్తిడిని ఎదుర్కోవటానికి మార్గాలు..
1. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి..
ఒత్తిడిని నివారించడానికి ఉత్తమ మార్గం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం. మీ మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేలా ఎక్కువ సమయం ఇవ్వకండి. బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాల్లో పెయింటింగ్, స్కెచింగ్, పాడటం, చదవడం వంటి మీకు ఇష్టమైన పనిని చేయవచ్చు. మీ ఈ పని మీ పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది. మీ బిడ్డ కూడా కూల్‌గా, సృజనాత్మకంగా మారుతుంది.

2. హాయిగా కునుకు తీయండి..
బిజీగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బిజీ కారణంగా శరీరం అలసిపోతుంది. ఇలా చేస్తే మంచి నిద్ర వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం చాలా మంది. తద్వారా మీలోని ఒత్తిడి కూడా తగ్గుతుంది. బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

3. పుస్తకాలు చదవండి..
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం చాలా మంచిది. దీని వల్ల మీ పిల్లల ఐక్యూ కూడా పెరుగుతుంది. పుస్తకాలను స్ట్రెస్ బస్టర్స్ అంటారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి.

4. ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి..
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం మీ మనస్సును ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది కాకుండా, నిపుణుల సూచనల మేరకు కొన్ని సులభమైన వ్యాయామాలు చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో మీకు చాలా సహాయపడుతుంది.

Also read:

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!