Coffee: మీ పిల్లలు కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

|

Aug 31, 2022 | 9:39 PM

Parenting Tips: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను వారే దగ్గరుండి చూసుకుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

Coffee: మీ పిల్లలు కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే
Coffee Side Effects
Follow us on

Parenting Tips: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను వారే దగ్గరుండి చూసుకుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నేటి తరం పిల్లలు జంక్‌ఫుడ్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, కెఫీనేటెడ్‌ డ్రింక్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు చిన్న వయస్సులోనే కాఫీ తాగడం ప్రారంభిస్తారు. అయితే ఇది పిల్లలకు మంచిదేనా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వారు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే..చిన్న పిల్లలు కాఫీ తాగితే..అసలు మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

కెఫీన్‌తో తయారైన ఉత్పత్తులు పిల్లలకు లేదా యువకులకు ఏ మాత్రం ప్రయోజనకరం కావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అది కాఫీ లేదా టీ అయినా రెండూ హానికరమైనవిగా పరిగణించాలని సూచిస్తున్నారు. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారి శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. కానీ కొంత వరకు కెఫిన్ పిల్లలకు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది వారి మెదడును చురుకుగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల భవిష్యత్‌లో పిల్లల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మరి కాఫీ ఎంత మోతాదులో తీసుకోవాలంటే..12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 100 మి.లీ. గ్రాము కెఫిన్ ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే 1 నుంచి 2 కప్పుల కాఫీ. దీని కంటే ఎక్కువ కెఫిన్ వారి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..