Over Sleep: ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. ఆరోగ్యానికి హానికరం అంటున్న నిపుణులు..

|

Dec 11, 2022 | 11:00 PM

రాత్రి 9గంటలకు ముందు 10 గంటల తర్వాత నిద్రపోయే వారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ సమయం, త్వరగా నిద్రపోతున్న వారిపై ఇటీవల చైనా లోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులపై చేసిన అధ్యయనంలో అనేక..

Over Sleep: ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. ఆరోగ్యానికి హానికరం అంటున్న నిపుణులు..
sleeping
Follow us on

ఒక వ్యక్తి కనీసం 6 నుంచి 8 గంటలు పాటు పోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. 6 గంటలకు తక్కువు కాకుండా 8 గంటలకు ఎక్కువ కాకుండా నిద్రపోవడం ఆరోగ్యకరమని చెబుతూ ఉంటారు. అయినా చాలా మంది 8 గంటలకు పైగా నిద్రపోతూ ఉంటారు. ఇలా అధికంగా నిద్రపోవడం వల్ల మేధోశక్తి తగ్గుతుందని, వృద్ధుల్లో అయితే ఈప్రమాదం ఎక్కవుగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 8 గంటల కంటే ఎక్కువుగా నిద్రపోవడం వల్ల వృద్ధుల్లో డిమెన్షియా   రిస్క్ పెరుగుతుంది.  త్వరగా నిద్రపోయే వారు లేదా ఎక్కువ సమయం నిద్రపోయేవారు చిత్త వైకల్య సమస్యతో బాధపడతారని నిపుణులు చెబుతున్నారు. చిత్త వైకల్యం అనేది మేథస్సు పనితీరులో గణనీయమైన క్షీణతను కలిగించే వైద్య సంబంధమైన రుగ్మత. ఇది అనేక వ్యాధులలో సంభవించే పలు లక్షణాల కలయిక. ఈ రుగ్మత కారణంగా మేధాశక్తి, ప్రవర్తనా తీరును తగ్గిపోయేలా చేస్తుంది. రోజువారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి ఎక్కువ సేపు నిద్రపోయినా, అవసరమైనంత సమయం నిద్రపోయినా ఆరోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. అందుకే నిర్ణీత సమయం మాత్రమే నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి 9గంటలకు ముందు 10 గంటల తర్వాత నిద్రపోయే వారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ సమయం, త్వరగా నిద్రపోతున్న వారిపై ఇటీవల చైనా లోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులపై చేసిన అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. చిత్తవైకల్యం అభివృద్ధి చెందని వారిలో కూడా ఎక్కువ సమయం నిద్రపోవడం, త్వరగా నిద్రపోవడం కారణంగా అభిజ్ఞా క్షీణత ఇప్పటికీ ఉందని అధ్యయనం కనుగొంది.

ఈలక్షణాలు 60 నుంచి 74 సంవత్సరాల మధ్య వారిలో ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అంటే వృద్ధుల్లో ఈప్రభావం ఎక్కువ. వాస్తవానికి గ్రామీణ చైనాలోని వృద్ధులు సాధారణంగా ముందుగా నిద్రపోతారు. పట్టణ, నగరాలకు చెందిన ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత వ్యక్తులు త్వరగా నిద్రపోతారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిమోన్షియా ప్రభావం ఎక్కువుగా ఉంటున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..