Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ కూరగాయేగా అనుకునేరు.. దీని జ్యూస్ అమృతం కన్నా పవర్‌ఫుల్.. దెబ్బకు షుగర్ కంట్రోల్..

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు.. అయితే.. డయాబెటిస్ చాలా సంక్లిష్టమైన వ్యాధి.. ఒకసారి దాని బారిన పడితే.. జీవితాంతం అతన్ని వదిలి పెట్టదు.. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది.. అయినప్పటకీ..

జస్ట్ కూరగాయేగా అనుకునేరు.. దీని జ్యూస్ అమృతం కన్నా పవర్‌ఫుల్.. దెబ్బకు షుగర్ కంట్రోల్..
Onion Juice For Diabetes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 11, 2025 | 12:48 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు.. అయితే.. డయాబెటిస్ చాలా సంక్లిష్టమైన వ్యాధి.. ఒకసారి దాని బారిన పడితే.. జీవితాంతం అతన్ని వదిలి పెట్టదు.. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది.. అయినప్పటికీ శాస్త్రవేత్తలు మధుమేహానికి గట్టి నివారణ మందులను కనుగొనలేకపోయారు. అయితే, సమతుల్య జీవనశైలి – ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అవలంబించడం ద్వారా మీరు డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. డయాబెటిసల్ లో మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా.. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి లాంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అయితే.. డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మీరు అనేక రకాల సహజ ఇంటి నివారణ చర్యలు ప్రయత్నించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. దీంతో షుగర్ నార్మల్ గా ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు.. మనం ఒక ప్రత్యేక కూరగాయను మరిగించి, దాని నీటిని తాగితే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండటమే కాకుండా, మన శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొంటున్నారు. అదేంటో కాదు.. ఉల్లిపాయ.. దీని రసం డయాబెటిస్ రోగులకు అమృతం లాంటిదని పేర్కొంటున్నారు. ఉడికించిన ఉల్లిపాయ తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందంటున్నారు.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం..

డయాబెటిస్ రోగులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఉల్లిపాయ రసం తాగడం ప్రారంభించాలని సూచిస్తున్నారు.. దీని సహాయంతో, టైప్-1, టైప్-2 రోగులు ఇద్దరూ ఉపశమనం పొందవచ్చు. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుందని పేర్కొంటున్నారు.

ఉల్లిపాయను అనేక విధాలుగా తీసుకుంటారు.. ఉల్లిపాయ లేకుండా చాలా వంటకాల రుచి చెడిపోతుంది. మీరు ఈ అద్భుతమైన కూరగాయను నేరుగా కూడా తినవచ్చు.. అయితే సలాడ్‌గా తినడం చాలా ఆరోగ్యకరమైన ఎంపిక.

మీరు ఉల్లిపాయను ఉడకబెట్టి, దాని రసం తీసి తాగితే, అది శరీరానికి డీటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీతో, శరీరంలోని కేలరీలు తగ్గడం ప్రారంభమవుతుంది.. డయాబెటిక్ రోగులు ఇంకా అనేక ప్రయోజనాలను పొందవచ్చు..

ఉల్లిపాయ రసం కోసం ఏం చేయాలంటే..

దీని కోసం, 2 మీడియం సైజు ఉల్లిపాయలను మెత్తగా కోయండి. ఇప్పుడు దానిని మిక్సర్ గ్రైండర్‌లో వేసి, 1 కప్పు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని తాగడం ద్వారా శరీరానికి ఫైబర్, అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. నిపుణులు అందించిన సమాచారం.. ఇంటర్నెట్ లో సేకరించిన కథనాల ప్రకారం.. ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..