AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Water: బొప్పాయి నీళ్లతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. అధిక బరువుతో పాటు ఆ సమస్యలకు చెక్‌

బొప్పాయి నీళ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. అలాగే పొట్టకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రుతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Papaya Water: బొప్పాయి నీళ్లతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. అధిక బరువుతో పాటు ఆ సమస్యలకు చెక్‌
Papaya Water
Basha Shek
|

Updated on: Nov 22, 2022 | 6:57 PM

Share

శారీరకంగా, మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ పండ్లనూ బాగా తీసుకోవాలని నిపుణులు తరచూ మనకు సూచిస్తుంటారు. బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు కానీ బొప్పాయి వాటర్ వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయి నీళ్లు ఎలా తయారు చేయాలంటే.. బొప్పాయి పండును ముందుగా సగానికి కట్‌ చేయాలి. ఆ తర్వాత పై తొక్క, బొప్పాయి గింజలను తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బొప్పాయి ముక్కలను నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టండి. మరిగించిన తర్వాత నీటిని చల్లారనివ్వాలి. ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి రెగ్యులర్‌గా తాగాలి. ప్రతిరోజూ ఈ హెల్దీ డ్రింక్‌ను తాగవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

క్యాన్సర్‌ నివారణకు..

బొప్పాయి నీళ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. అలాగే పొట్టకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రుతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. అలాగే మైగ్రేన్ నొప్పిని కూడా నివారిస్తుంది. ఇక పచ్చిపండ్లు దొరికినప్పుడు బొప్పాయి నీళ్లు ఎందుకు తాగాలి అన్నది చాలామంది ప్రశ్న. బొప్పాయి నీళ్లలో లైకోపీన్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక బొప్పాయిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, కానీ దానిని నీటిలో ఉడకబెట్టినప్పుడు, లైకోపీన్ దాని నుండి బయటకు వస్తుంది, ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి మంచి ఆహారం. బొప్పాయి నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ప్రేగులను శుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా చేస్తుంది. కేవలం బొప్పాయే కాదు ఏదైనా ఫ్రూట్ వాటర్ (డిటాక్స్ వాటర్ ఓవర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్) రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి నీళ్లు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..