AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Music at sleep: పాటలు వింటూ నిద్రపోవడం అలవాటా? ఇకపై మీ అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..?

Music at sleep: చాలా మంది రాత్రి పడుకునే ముందు సంగీతం వినడానికి ఇష్టపడతారు. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారిపోవడం మంచి అనుభూతి ఇవ్వడమే కాకుండా.. చక్కని నిద్ర పడుతుందని వారు చెబుతారు.

Music at sleep: పాటలు వింటూ నిద్రపోవడం అలవాటా? ఇకపై మీ అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..?
Music At Sleep
KVD Varma
|

Updated on: Jun 16, 2021 | 7:07 PM

Share

Music at sleep: చాలా మంది రాత్రి పడుకునే ముందు సంగీతం వినడానికి ఇష్టపడతారు. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారిపోవడం మంచి అనుభూతి ఇవ్వడమే కాకుండా.. చక్కని నిద్ర పడుతుందని వారు చెబుతారు. అయితే, తాజాపరిశోధన ప్రకారం, అలాంటి వ్యక్తులు నిద్రలేమి.. నిద్ర లేకపోవడం గురించి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. రాత్రి పడుకునే ముందు పాటలు విన్నప్పుడు, అవి మెదడులో తిరుగుతూ ఉంటాయి. పాట ఆగిన తర్వాత కూడా అది నడుస్తున్న అనుభూతి మనసులో ఉంది. ఈ పరిస్థితి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అర్ధరాత్రి నిద్ర నుంచి మెలకువ వచ్చేసే అవకాశాలను పెంచుతుంది. మీరు పాటలు వింటూ పడుకున్నపుడు కొద్దిసేపు నిద్రలోకి జారిపోతారు. కానీ, ఆ పాటలు ఆగిపోయిన వెంటనే మీకు మెలకువ స్థితి వచ్చేస్తుంది. లేదా ఆగిపోయిన కొద్దిసేపటి తరువాత మీకు పూర్తిగా మెలకువ వచ్చేస్తుంది. చాలా మంది దీనిని గమనించలేరు.

ఎందుకంటే, పాటలు వింటే నిద్ర పట్టేసింది అనే విషయమే వారు గుర్తుంచుకుంటారు. తరువాత పాట ఆగిపోతే నిద్ర మెలకువ వచ్చేసింది అనే అంశాన్ని వారు విస్మరిస్తారు అని ఈ పరిశోధనలు చేసిన బాలేర్ పరిశోధకుడు మైఖేల్ చెబుతున్నారు. పాటలు వింటూ నిద్రపోయే అలవాటు ఉన్న 209 మందిపై వీరు పరిశోధనలు చేశారు. నిద్రపోయే ముందు, వారికి నచ్చిన సంగీతాన్ని వినిపించారు. దీని తరువాత వారికి పాలిసోమ్నోగ్రఫీ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష సహాయంతో, ఎంత మంచి నిద్ర వస్తుందో తెలుస్తుంది. పరీక్ష చేయడం ద్వారా, మానవ మెదడులోని తరంగం, గుండె మరియు శ్వాస రేటుల తారతమ్యాలు తెలుస్తాయి. ఇవి మనిషి నిద్ర ఎలా ఉందొ చెబుతాయి. రోగి నిద్రిస్తున్నప్పుడు ఈ పరీక్ష జరిపారు.

సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనల ఫలితాల ప్రకారం, నిద్రలో కూడా పాటలు మెదడులో తిరుగుతూనే ఉంటాయి. మనం మేల్కొని ఉన్నప్పుడు, పాటలు మెదడులో మళ్లీ మళ్లీ తిరుగుతాయి. రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా ఇది జరుగుతుంది. సంగీతం ఆపివేసినా, మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ పాట మన మనస్సులో తిరుగుతుంది. ఫలితంగా, ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది.

తరచుగా టీనేజర్స్, యువకులు వారి మానసిక స్థితిని మెరుగుపర్చడానికి నిద్రపోయే ముందు ఒక పాట వింటారు. కానీ, కొన్నిసార్లు ఈ అభిరుచి రోజువారీ అలవాటుగా మారుతుంది. ఇది నిద్రపై చెడు ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ఇలా నిద్రపోయేటప్పుడు పాటలు వినడం వారంలో ఒకసారికంటే ఎక్కువసార్లు చేస్తే..అలాంటి వారిలో నిద్ర భంగం కలిగించే ప్రమాదం 6 రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, పదాలతో కూడిన సంగీతం కంటే వాయిద్య సంగీతం చాలా ఎక్కువగా నిద్ర భంగం కలిగించే పాత్ర పోషిస్తుంది.

Also Read: Health Benefits of Laughing: నవ్వంటే బ్రెయిన్‌కు లవ్‌.. లాఫింగ్ వ‌ల్ల‌ క‌లిగే అద్భుత‌మైన‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే

Diseases during rainy season: వర్షాకాలం వ్యాధులు ముసిరే సీజన్..జ్వరం నుంచి ఫంగస్ దాకా.. అన్నీఇప్పుడే..జాగ్రత్తలు తీసుకోండి ఇలా!