AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ హెర్బల్ టీ ట్రై చేయండి.. ఆ వ్యాధులకు చెక్ పెట్టండి..

వానాకాలం వచ్చిందంటే ప్రజలను అనే రోగాలు వేధిస్తాయి. అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది వ్యాధులు రాకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. కానీ ఒక్క సారి ఈ హెర్బల్ టీ ని ట్రై చేయండి. అద్భుత ప్రయోజనాలను పొందుతారు. దీన్ని తయారీ, ఉపయోగాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ హెర్బల్ టీ ట్రై చేయండి.. ఆ వ్యాధులకు చెక్ పెట్టండి..
Herbal Tea
Krishna S
|

Updated on: Jul 18, 2025 | 5:52 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. చల్లని గాలి, తడి బట్టలు, వాతావరణంలో తేమ మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో చాలా మంది చర్మ దద్దుర్లు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతారు. అటువంటి పరిస్థితిలో మీ కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ఈ వ్యాధుల నుండి సురక్షితంగా ఉండాలని అనుకుంటే.. మీ ఆహారంలో ఆయుర్వేదాన్ని చేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ హెర్బల్ టీ శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడటమే కాకుండా వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

హెర్బల్ టీ కి కావాల్సిన  8 పదార్థాలు :

తులసి ఆకులు – రోగనిరోధక శక్తికి సహజ కవచం

అల్లం – జలుబు, జీర్ణక్రియకు పరిష్కారం

పిప్పలి – జీర్ణక్రియ, దగ్గుకు దివ్యౌషధం

దాల్చిన చెక్క – రక్తంలో చక్కెర నియంత్రణ, కొవ్వును కరిగిస్తుంది.

లవంగాలు – యాంటీ బాక్టీరియల్ శక్తికి మూలం

యాలకులు – రుచితో పాటు జీర్ణక్రియకు సహాయపడుతుంది

పసుపు పొడి – శరీర నిర్విషీకరణ మరియు శోథ నిరోధక శక్తి

నీరు – జీవితానికి ఆధారం

నిమ్మరసం – విటమిన్ సి సమృద్ధిగా ఉండడంతో పాటు రుచిలో మెరుగ్గా ఉంటుంది.

ఈ పదార్థాలన్నింటినీ నాలుగు కప్పుల నీటిలో వేసి తక్కువ మంట మీద మరిగించాలి. ఈ మిశ్రమం రెండు కప్పులకు వచ్చినప్పుడు దాన్ని వడపోసి కప్పులో పోసుకోవాలి. ఇప్పుడు దానికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించవచ్చు. ఇది ప్రతి సిప్‌తో మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.

ఈ హెర్బల్ టీ ప్రయోజనాలు :

బలమైన రోగనిరోధక శక్తి

వర్షాకాలంలో వైరల్ ఫీవర్ , జలుబు ప్రమాదం చాలా మందిని వేధిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ హెర్బల్ టీ ని ప్రతిరోజూ తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. పదే పదే అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

జీర్ణక్రియ మెరుగ్గా..

అల్లం, పిప్పలి ఉండటం వల్ల ఈ టీ జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షంలో.. కడుపు నొప్పి, విరేచనాలు లేదా గ్యాస్ సమస్యలు సర్వసాధారణం. ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు తేలికగా అనిపిస్తుంది.

బరువు తగ్గడంలో..

మీరు బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటే.. ఈ హర్బల్ టీ ని తీసుకోవడం గొప్పగా ఉంటుంది. ఇందులో ఉండే దాల్చిన చెక్క, పసుపు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దీంతో అటోమేటిక్‌గా బరువు తగ్గుతారు.

శరీరం డీటాక్సిఫై..

ఎక్కువగా వేయించిన ఆహారం తినడం, బయటి నీరు త్రాగడం, చెడు అలవాట్ల కారణంగా శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఈ మూలికా టీ ఆ విషపదార్థాలను తొలగించి.. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..