Monsoon Diet: వర్షాకాలంలో దాడి చేసే వైరస్‌ల నుంచి తట్టుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచే పదార్థాలు..!
Monsoon Diet: ఈ వర్షాకాలం సీజన్‌లో అనేక వైరస్‌ను దాడి చేసే అవకాశం ఉంది. ఈ వర్షాకాల సీజన్‌లో వైరస్‌లు దాడి చేయకుండా ఉండేందుకు మంచి పోషక విలువలున్న..
Monsoon Diet: ఈ వర్షాకాలం సీజన్‌లో అనేక వైరస్‌ను దాడి చేసే అవకాశం ఉంది. ఈ వర్షాకాల సీజన్‌లో వైరస్‌లు దాడి చేయకుండా ఉండేందుకు మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వర్షకాలంలో మరిన్ని వైరస్‌లు చుట్టుముట్టే అవకాశం ఉంది. వాటి నుంచి గట్టెక్కాలంటే రోగనిరోధక శక్తిం పెంచుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
నారింజ: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో ఒకటైన నారింజ. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా విటమిన్-సి లభ్యమవుతుంది. విటమిన్-సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
బయటి ఆహారం వద్దు:
ఈ వర్షాకాలంలో బయట నుంచి తెచ్చుకునే ఆహారానికి స్వస్తి చెప్పాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం ఉత్తమం. పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తి పెంచడంతో ఎంతగానో సహాయ పడతాయి. భోజనంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. నిమ్మ రసం నీటిల అల్లం ముక్కలు వేసి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
వర్షాకాలం వేసవి కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆకు కూరలను తీసుకోవడం కూడా మంచిదే.
మొక్కజొన్న: కాస్త ఉప్పు, కారం కలిపి వెన్న రాసి కాల్చిన మొక్కజొన్న చినుకులు పడుతున్నప్పుడు ఇష్టంగా తినే చిరుతిండి. మొక్కజొన్న ఆరోగ్యకరమైన రుతుపవనాల ఆహారం ఎందుకంటే దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో లుటిన్ మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నను ఉడికించవచ్చు లేదా కాల్చవచ్చు.
హెర్బల్ టీ, కషాయాలు
వర్షా కాలంలో మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపర్చుకోవడానికి హెర్బల్ టీ లేదా కషాయాలను క్రమం తప్పకుండా తాగాలి. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.