AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Molecular Farming: త్వరలో కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ మొక్కలు.. ఫలిస్తున్న శాస్త్రవేత్తల ప్రయోగాలు

Molecular Farming: మానవాళిని శతాబ్దాలుగా వైరస్ లు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని వైరస్ ల గురించి మన పెద్దలు చెబితే విన్నాం.. కొన్నిటి గురించి చరిత్రలో చదువుకున్నాం..

Molecular Farming: త్వరలో కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ మొక్కలు.. ఫలిస్తున్న శాస్త్రవేత్తల ప్రయోగాలు
Molecular Farming
Surya Kala
|

Updated on: Aug 17, 2021 | 11:33 AM

Share

Molecular Farming: మానవాళిని శతాబ్దాలుగా వైరస్ లు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని వైరస్ ల గురించి మన పెద్దలు చెబితే విన్నాం.. కొన్నిటి గురించి చరిత్రలో చదువుకున్నాం..అయితే నేటి జనరేషన్ కు కరోనా వైరస్ గురించి స్వయంగా తెలుసు. చైనాలోని వుహాన్ లో వెలుగులోకి వచ్చి.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి దేశాలు తమ ప్రజలను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచిస్తున్నారు . ఈ నేపథ్యంలో శాస్త్రజ్ఞులు వ్యాక్సిన్ మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. అవును మాలిక్యులర్‌ ఫార్మింగ్‌’తో మొక్కల్లోనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కరోనా సహా పలు వైరస్‌లకు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయని అంటున్నారు.

జికా వైరస్, కరోనా వంటి అనేక వైరస్ లు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మనవాళిపై బ్యాక్టీరియా, ఫంగస్‌ల వంటి సూక్ష్మజీవుల దాడిపెరిగింది. వాటిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తప్పనిసరి.. అయితే టీకాల ఉత్పత్తిని చేయడం అంటే ఖర్చుతో పటు శ్రమతో కూడుకుంది. దీంతో శాస్త్రజ్ఞులు తమ మేధస్సుకు పదును పెట్టారు. సరికొత్తగా ఆలోచింది… మొక్కల్లోనే జన్యుమార్పిడి చేసి, అతి తక్కువ ఖర్చుతో వ్యాక్సిన్లను, మందులను ఉత్పత్తి చేసే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనినే ‘మాలిక్యులర్‌ ఫార్మింగ్‌’ అంటారు. నిజానికి ఈ వ్యాక్సిన్ మొక్కల పెంపకాన్ని 1986లోనే ప్రతిపాదించినా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ వేగం పుంజుకుంది. ప్రస్తుతం కెనడా శాస్త్రవేత్త హుగెస్‌ ఫాస్థర్, అమెరికా శాస్త్రవేత్త గ్యారీ కోబింగర్‌ ఈ మాలిక్యులర్‌ ఫార్మింగ్‌పై విస్తృత స్థాయిలో ఈ ఫార్మింగ్ పై ప్రయోగాలు చేస్తున్నారు.

శారీరక పరిస్థితికి అనుగుణంగా త్యేకంగా వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ‘మాలిక్యులర్‌ ఫార్మింగ్‌’ అనుకూలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలతో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మొక్కను ఆహారంగా తీసుకోవచ్చు, లేదా ట్యాబ్లెట్ల రూపంలో వేసుకోవచ్చు. అప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ మొక్కలను తయారు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లను మొక్కల్లో ఉత్పత్తి చేసే పరిశోధన ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌లో వినియోగించే ‘కోవీఎల్‌పీ’, ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌లో ఉపయోగించే మరో క్యాండిడేట్‌కు సంబంధించి ఇప్పటికే ల్యాబ్‌లో ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. మొక్కల నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తి చేయబోతున్నామని శాస్త్రవేత్తలు ఫాస్థర్, కోబింగర్‌ తెలిపారు.

ఇలా వ్యాక్సిన్ మొక్కల ఉత్పత్తికి గ్రీన్‌హౌజ్‌ ఏర్పాట్లు ఉంటే చాలు.. ‘మాలిక్యులర్‌ ఫార్మింగ్‌’ చాలా సులువుగా.. తక్కువ ధరతో మొక్కలను పెంచుకోవచ్చని చెబుతఙన్నారు. మొక్కలను పెంచుకోవడానికి సరైన వాతావరణం, నిర్ణీత పరిస్థితుల్లో పెంచగలిగితే చాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కెనడాకు చెందిన మెడికాగో అనే బయో ఫార్మాస్యూటికల్‌ సంస్థ ఒకరకమైన పొగాకు మొక్కలతో కరోనా వ్యాక్సిన్‌ రూపొందిస్తున్నామని ప్రకటించింది. ఆ మొక్కల్లో జన్యుమార్పిడి చేసి.. అచ్చం కరోనా వైరస్‌ను పోలిన పార్టికల్స్‌ (వీఎల్‌పీ)ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పార్టికల్స్‌లో జన్యుపదార్థం ఉండదని, పునరుత్పత్తి చెందకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ సంస్థ వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన వీఎల్‌పీ పూర్తిగా కరోనా లాగానే ఉంటుందని.. రోగ నిరోధక శక్తిని పూర్తిస్థాయిలో ప్రేరేపిస్తోందని ప్రకటించింది. ఈ సంస్థ ఇప్పటికే 30 వేల మంది రోగులపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

Also Read:  ఆప్ఘనిస్థాన్ వార్.. మనదేశ వాణిజ్యంపై ప్రభావం.. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయంటే (photo story)