AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Leaves Benefits: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే కొత్తిమీరతో చెక్ పెట్టండిలా.. ఇలా చేస్తే రిజల్ట్ పక్కా..

సాధారణంగా వంటలలో మరింత రుచిని పెంచేందుకు కొత్తిమీరను ఉపయోగిస్తుంటాము. దీనివలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి.

Coriander Leaves Benefits: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే కొత్తిమీరతో చెక్ పెట్టండిలా.. ఇలా చేస్తే రిజల్ట్ పక్కా..
Coriander Leaves
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2021 | 10:48 AM

Share

సాధారణంగా వంటలలో మరింత రుచిని పెంచేందుకు కొత్తిమీరను ఉపయోగిస్తుంటాము. దీనివలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. కొత్తమీర నుంచి వచ్చే దనియాల వలన కూడా ఆరోగ్యానికి ఎక్కువగా ప్రయోజనాలు. అయితే కొత్తిమీరతో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చర్మానికి కాంతి పెంచడమే కాకుండా.. మొటిమలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీరతో జుట్ట సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే కొత్తిమీర ఆకులతో చర్మ సమస్యలను ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందామా.

కొత్తిమీర ఆకులు, తేనె, పాలు, నిమ్మ.. చర్మ కాంతిని పెంచడానికి కొత్తమీర ఆకులు ఎక్కువగా పనిచేస్తాయి. ఇందుకోసం కొత్తిమీర ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలపాలి. రెండు చెంచాల పచ్చిపాలను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. ముఖం, మెడపై అప్లై చేయాలి. అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

కొత్తిమీర ఆకులు, బియ్యం, పెరుగు.. కొత్తిమీర ఆకులను కడిగి శుభ్రం చేసి ఆ తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులో ఒక చెంచా గ్రౌండ్ రైస్, ఒక చెంచా పెరుగు కలపాలి. ఇవన్నీ బాగా కలిపి.. ఆ తర్వాత ప్యాక్ లాగా ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంలోని కండరాలు, కణాలు చాలా విశ్రాంతిని పొందుతాయి. చర్మం మెరుస్తుంది.

కొత్తిమీర ఆకులు, నిమ్మరసం.. కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది అలాగే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.

కొత్తిమీర ఆకులు, అలోవెరా జెల్.. కొత్తిమీర ఆకులను కడిగి శుభ్రం చేసి మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అందులో ఒక చెంచా కలబంద జెల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇది ముడుతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు తక్కువ. అలాగే యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‏ను తొలగిస్తుంది. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం మొదలైనవి ఉన్నాయి. కొత్తిమీర రుచి కోసమే కాకుండా ఎన్నో రకాల వ్యాదులకు చికిత్స గా కూడా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకులు రసం తీసి అంతే పరిమాణంతో తేనె కలిపి రోజు పడుకునే ముందు తాగితే విటమిన్స్ a, b1, b2, c, ఐరన్ లోపాలతో వచ్చే వ్యాదులు దరి చేరవు.

Also Read: VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..

Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపమే.. ఎలా అధిగమించాలంటే..

Walking Benefits: రోజూ అరగంట నడవడం వలన వృద్ధాప్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. నడకతో ప్రయోజనాలు బోలేడు..