AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine: మైగ్రేన్‌‌తో బాధపడుతున్నారా.. ఈ 10 ఆహారాలను దూరం పెట్టాల్సిందే..!

మైగ్రేన్‌లు రకరకాల కారణాల వల్ల కలుగుతాయి. ఇందులో పెద్ద శబ్దాలు, ఫ్లాష్ లైట్లు, ఆందోళన, వాసనలు, మందులు మొదలైనవి ఉంటాయి. అలాగే, మైగ్రేన్ దాడిని ప్రోత్సహించే కొన్ని ఆహారాలు, పానీయాలు ఉన్నాయి.

Migraine: మైగ్రేన్‌‌తో బాధపడుతున్నారా.. ఈ 10 ఆహారాలను దూరం పెట్టాల్సిందే..!
Migraine
Venkata Chari
|

Updated on: Jan 04, 2022 | 9:38 AM

Share

Migraine: అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం, ప్రపంచంలో 100 మిలియన్ల మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఇది ఒక రకమైన తలనొప్పి. ఇది వచ్చినప్పుడు వ్యక్తి తలలో సగం భాగంలో జలదరింపులా అనిపిస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని గంటల నుంచి చాలా రోజుల వరకు బాధపెడుతుంది. ఈ వ్యాధి జన్యుపరమైనదని నమ్ముతుంటారు. మైగ్రేన్‌లు రకరకాల కారణాల వల్ల కలుగుతాయి. ఇందులో పెద్ద శబ్దాలు, ఫ్లాష్ లైట్లు, ఆందోళన, వాసనలు, మందులు మొదలైనవి ఉంటాయి. అలాగే, మైగ్రేన్ దాడిని ప్రోత్సహించే కొన్ని ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. చాలా మందిలో మైగ్రేన్‌ను ప్రేరేపించే ఆ 10 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వైన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం, 35 శాతం మంది రోగులు మద్యం సేవించిన తర్వాత మైగ్రేన్‌లు పొందుతారు. అలాగే, రెడ్ వైన్ తాగేవారిలో 77 శాతం మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. మద్యం తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది తలనొప్పికి ప్రధాన కారణంగా ఉంటుంది.

2. చాక్లెట్ మద్యం తర్వాత, మైగ్రేన్‌ను ప్రేరేపించే అత్యంత సాధారణ ఆహారం చాక్లెట్. అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం, మైగ్రేన్ బాధితుల్లో 22 శాతం మందికి చాక్లెట్ సమస్యతో మైగ్రేన్ వస్తుంది. చాక్లెట్‌లో కెఫిన్‌తో పాటు మైగ్రేన్ నొప్పిని పెంచే బీటా-ఫెనిలేథైలమైన్ అనే రసాయనం ఉంటుంది.

3. కెఫిన్ మీరు మైగ్రేన్ వచ్చిన తర్వాత కూడా టీ, కాఫీ తాగితే, అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మీ తలనొప్పి పెరుగుతుంది. కెఫీన్ సాధారణంగా టీ, కాఫీ, చాక్లెట్లలో కనిపిస్తుంది.

4. కృత్రిమ స్వీటెనర్ మార్కెట్‌లో లభించే చాలా వస్తువులలో కృత్రిమ స్వీటెనర్‌ను ఉపయోగిస్తారు. ఇది ఆహార పదార్థాలకు తీపిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ ఇందులో ఉండే అస్పర్టమ్ రసాయనం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

5. మోనోసోడియం గ్లుటామేట్ ఆహార రుచిని పెంచేందుకు మోనోసోడియం గ్లుటామేట్ (MSG) ఉపయోగిస్తుంటారు. ఇది చైనీస్ సూప్‌లు, మాంసాహార ఆహారంలో ఎక్కువగా కలుపుతారు. ఇది తినడానికి సురక్షితంగా పరిగణించినా.. మైగ్రేన్ రోగులకు ఇది హానికరంగా మారుతుంది.

6. ప్రాసెస్డ్ మీట్స్ హామ్, హాట్ డాగ్‌లు, సాసేజ్‌లు వంటి మాంసాలు వివిధ రకాల రసాయనాలు, కృత్రిమ రంగులు, సంరక్షణకారులను కలిగి ఉంటాయి. ఇవి మన మెదడుకు మంచివి కావు. ఈ మాంసాహారం తినడం వల్ల మైగ్రేన్ పేషెంట్లలో సమస్యలు వస్తాయి.

7. చీజ్ పాత చీజ్‌లలో టైరమైన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మైగ్రేన్, ఇతర రకాల తలనొప్పికి కారణమవుతుంది. టైరమైన్ సాధారణంగా ఫెటా, బ్లూ చీజ్, పర్మేసన్‌లలో కనిపిస్తుంది.

8. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువ ఉప్పు అంటే సోడియం ఎక్కువ. శరీరంలో అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్లకు దారితీస్తుంది.

9. ఘనీభవించిన ఆహారాలు ఐస్ క్రీం, స్లష్ వంటి ఘనీభవించిన ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వ్యాయామం చేసిన వెంటనే చల్లని ఆహారం తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది.

10. ఊరగాయలు లేదా పులియబెట్టిన ఆహారం పాత చీజ్ లాగా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఊరగాయలు లేదా పులియబెట్టిన ఆహారాన్ని తినడం కూడా మైగ్రేన్ దాడిని ప్రేరేపిస్తుంది. వాటిలో టైరమైన్ రసాయనం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఉదాహరణ- ఊరగాయలు, కిమ్చీ, కొంబుచా మొదలైనవి తినడం తగ్గించాలి.

Also Read: Radish Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తినకూడదట.. ఈ పదార్థాలతో కలిపి తీసుకుంటే..

Microwave: మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..