AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart disease: మీ జీతానికి, గుండెపోటుకు లింక్ ఉంటుందా? కొత్త పరిశోధనలో విస్తుపోయే విషయాలు..

మీరు అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తున్నారా? తక్కువ జీతం అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారా? అయితే మీ జీవితం ప్రమాదంలో పడినట్లే. తక్కువ జీతం తీసుకుంటూ.. అధిక ఒత్తిడితో పనిచేసే వ్యక్తుల చిట్టి గుండెకు రెండింతల ప్రమాదం పొంచి ఉంది. అదేంటి జీతానికి గుండె ఆరోగ్యానికి లింకేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఆశ్చర్యపోవాల్సిన అంశమే.

Heart disease: మీ జీతానికి, గుండెపోటుకు లింక్ ఉంటుందా? కొత్త పరిశోధనలో విస్తుపోయే విషయాలు..
Work Stress
Follow us
Madhu

|

Updated on: Sep 22, 2023 | 4:42 PM

మీరు అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తున్నారా? తక్కువ జీతం అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారా? అయితే మీ జీవితం ప్రమాదంలో పడినట్లే. తక్కువ జీతం తీసుకుంటూ.. అధిక ఒత్తిడితో పనిచేసే వ్యక్తుల చిట్టి గుండెకు రెండింతల ప్రమాదం పొంచి ఉంది. అదేంటి జీతానికి గుండె ఆరోగ్యానికి లింకేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఆశ్చర్యపోవాల్సిన అంశమే. అధిక ఒత్తిడితో పాటు తక్కువ జీతానికి పనిచేసే వ్యక్తులకు గుండె పోటు వచ్చే అవకాశం రెండింతలు అధికమని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు జర్మల్ సర్క్యూలేషన్ లో కార్డియోవాస్కులర్ క్వాలిటీ అండ్ అవుట్ కమ్స్ పేరిట ప్రచురితమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వారితో పోల్చితే రెండింతలు..

ప్రతి పనిలోనూ ఒత్తిడి ఉంటుంది. కానీ తక్కువ జీతం పొందుతూ అధిక ఒత్తిడికి గురయ్యే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువని అధ్యయనం వివరించింది. ఎక్కువ జీతంతో ఎక్కువ ఒత్తిడితో పనిచేసే వారితో పోల్చితే తక్కువ జీతంతో పనిచేసే వారికి రెండింతలు ప్రమాద అవకాశం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగంలో ఒత్తిడి, శాలరీలో హెచ్చుతగ్గులు ఈ రెండు కారణాలు వ్యక్తులకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని 49శాతం పెంచుతుందని వివరించారు. ఈ విషయాలను జర్మల్ సర్క్యూలేషన్ లో కార్డియోవాస్కులర్ క్వాలిటీ అండ్ అవుట్ కమ్స్ పేరిట ప్రచురించారు.

పరిశోధన ఇలా..

45 వయసున్న దాదాపు 6,500మంది ఎటువంటి గుండె జబ్బులు లేని కార్మికులపై 18 ఏళ్లపాటు(2000 నుంచి 2018) ఈ పరిశోధన కొనసాగింది. దీనిలో ప్రధానంగా వారి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి.. ఆ పనికి, ఒత్తిడికి తగిన వేతనం పొందడం అంశంగా పలు ప్రశ్నలను వారిని అడిగి నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వారి సమాధానాల ఆధారంగా పని వాతావరణంలో ఒత్తిడి, వారి జీతభత్యాల్లో తేడాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. ముఖ్యంగా పురుషుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. ఈ పరిశోధనపై కెనడాలోని సీహెచ్యూ డీ క్యూబెక్ యూనివర్సిటీ లావల్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన పరిశోధకుడు మాథిల్డే లవిగ్నే రోబిచౌడ్ మాట్లాడుతూ పనివాతావరణంలో ఉండే ఒత్తిడి వల్ల్ వచ్చే సైకలాజికల్ ఇబ్బందులు డైరెక్ట్ గా కరోనరీ హార్ట్ డిసీజ్ లకు సంబంధం ఉందని చెప్పారు. ఇది పురుషుల్లోనే అధికంగా ఉందని, మహిళల్లో దీని ప్రభావంపై మరింత పరిశోధన అవసరం అని చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న