AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పాదాలను చూస్తే అర్థమవుతుంది.. ఎలాగో తెలుసా?

Health Tips: జీవనశైలి సక్రమంగా ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు వైద్య నిపుణులు. కానీ ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి..

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పాదాలను చూస్తే అర్థమవుతుంది.. ఎలాగో తెలుసా?
Subhash Goud
|

Updated on: Dec 08, 2024 | 12:23 PM

Share

ఈ రోజుల్లో ఎంతో మందికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం జీవనశైలిలో మార్పులు. ఒకప్పుడు కంటే ప్రస్తుతం రకరకాల సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. జీవనశైలి సక్రమంగా ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు వైద్య నిపుణులు. కానీ ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వివిధ వ్యాధులకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా యువత ఎక్కువగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు గుండెపోటు వయసు 40 ఏళ్లకు తగ్గిందని వివిధ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి కారణం. కానీ సమస్య ఏమిటంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నా, రక్తపరీక్ష చేసేంత వరకు తెలియడం లేదు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా మందికి తెలియదు. మీ పాదాలను గమనించడం ద్వారా మీ కొలెస్ట్రాల్ పెరుగుతుందో లేదో మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి?

ఉదయం లేవగానే మీ పాదాలు ఉబ్బినట్లుగా కనిస్తే జాగ్రత్తగా ఉండాలి. బహుశా కాలికి గాయం కాకపోవచ్చు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్ల వాపులు వస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే, పాదాల వాపుకు కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

మీరు కొన్నిసార్లు మీ కాళ్ళలో నొప్పిగా ఉన్నా, కాళ్లు చచ్చుబడిపోయినా కాళ్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉండవచ్చు. ఫలితంగా కాళ్లకు సరైన రక్త ప్రసరణ నిలిచిపోతుంది. అందుకే చిన్నపాటిగా నొప్పి మొదలవుతుంది. ఇది రాత్రి నిద్రిస్తున్నప్పుడు మొదలవుతుంది.

కాలి కండరాలు ఎప్పుడు ఒత్తిడికి గురవుతాయి. అరికాళ్ల కింద మంటలు రావచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. కాళ్లలో తిమ్మిర్లు, కాలి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే రాత్రిపూట పాదాలు నిరంతరం చల్లగా ఉంటాయి. శీతాకాలం లేదా వేడి లేదా వర్షాకాలంలోనూ అలాగే ఉండవచ్చు. అన్ని సీజన్లలో రాత్రిపూట చలి పాదాలు, ఇది రెగ్యులర్‌గా ఉంటే జాగ్రత్తగా ఉండటం అవసరం. వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

కొలెస్ట్రాల్‌ పెరిగితే కొద్ది దూరం నడవగానే అలసిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ అధిక కొలెస్ట్రాల్ మిమ్మల్ని కొద్దిగా అలసిపోయేలా చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. వైద్య సలహా తీసుకోండి. రక్త పరీక్ష చేయించుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి