White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..

మీరు కూడా తెల్లజుట్టు సమస్యతో సతమతమవుతున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. వృద్ధులే కాదు 25 నుంచి 30 ఏళ్ల యువత కూడా తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం..

White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..
White Hair Home Prevention
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 8:22 PM

మీరు కూడా తెల్లజుట్టు(White Hair) సమస్యతో సతమతమవుతున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. వృద్ధులే కాదు 25 నుంచి 30 ఏళ్ల యువత కూడా తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. తెల్ల వెంట్రుకలను దాచడానికి మనలో చాలా మంది తరచుగా ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఈ ఉత్పత్తులలో చాలా రసాయనాలు కనిపిస్తాయి. ఇవి జుట్టుకు చాలా హాని కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో మనం ఇంట్లో లభించే కొన్ని చిట్కాలతో తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు. 

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ 3 విషయాలను ఉపయోగించండి

1. తులసి 

జుట్టు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం ఎంతో పవిత్రంగా పూజించే తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని ప్రభావం తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

  1. ముందుగా తులసి ఆకులను తీసుకోండి.
  2. ఇప్పుడు జామకాయ పండు లేదా దాని ఆకుల రసాన్ని అందులో కలపండి.
  3. గుంటకలగర ఆకుల రసాన్ని సమాన పరిమాణంలో తీసుకోండి.
  4. ఇప్పుడు ఈ మూడు మిశ్రమాలను సరిగ్గా మిక్స్ చేసి జుట్టుకు బాగా అప్లై చేయండి.
  5. ఇది జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పని చేస్తుందని చాలా మంది నమ్ముతారు.

2. కరివేపాకు

కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు కనిపిస్తాయి. ఇవి జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. ఇది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. ఇందుకోసం కరివేపాకును జుట్టుకు పట్టించవచ్చు. అలాగే, మీరు అప్లై చేసే నూనెలో కరివేపాకు వేసి, ఆపై ప్రతి వారం వాడండి.

3. నిమ్మకాయ 

నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

  1. ఆయుర్వేదం ప్రకారం, 15 మిల్లీలీటర్ల నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకోండి
  2. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేయండి. ఆపై ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేయండి.
  3. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. కొన్ని రోజులు దీనిని వాడేంత వరకు జుట్టు నల్లబడటంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..

Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..