ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. కేవలం వంటకాలలో మాత్రమే కాకుండా.. పచ్చి ఉల్లిపాయను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా రోజూ పచ్చి ఉల్లిపాయాలను తినడం వలన అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చి ఉల్లిపాయలతో కలిపి నిమ్మకాయను తీసుకుంటారు. నిమ్మకాయను ఉల్లిపాయతో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజాలు ఉన్నాయట. ఉల్లిపాయ అల్లిసన్ దిగుబడి. అంటే సల్ఫర్ సమ్మేళనం. ఇది శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. బరువు తగ్గించడంలోనూ ఉల్లిపాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సాధారణంగా రోజూ తీసుకునే సలాడ్స్, వంటలలో పచ్చి ఉల్లిపాయలతో కలిపి నిమ్మకాయను తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. ఉల్లిపాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలో ప్రీబయోటిక్ ఇన్సులిన్, ఫ్రక్టోలిసాకరైట్లు ఉంటాయి. ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థను సక్రమంగా పనిచేస్తుంది. ఇక ఉల్లిపాయలను టామోటాలతో కలిపి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. టామోటాల్లో లైకోపిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అయితే అందరూ ఉల్లిపాయలను తీసుకోవడం మంచిది కాదు. ఎసిడిటి సమస్య లేదా అపానవాయువు సమస్య ఉన్నవారు లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు ఉల్లిపాయను అస్సలు తినకూడదు. దీంతో మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిమ్మకాయలు.. ఉల్లిపాయలు జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలడం.. డాండ్రఫ్ వంటి సమస్యలను నియంత్రించడంలో నిమ్మకాయలు.. ఉల్లిపాయలు ఎక్కువగా సహాయపడతాయి.
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..