Mango leaves: మామిడి ఆకులతో మెరిసే చర్మం.. ఇలా వాడితే మొటిమలు, మచ్చలు మాయం..!
పండ్లలో రారాజు మామిడి.. మామిడి పండు రుచి మనందరికీ తెలుసు.. మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. మార్కెట్లో అనేక రకాలైన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. అయితే, మామిడి పండ్లు కేవలం రుచి, సువాసన, మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు.

పండ్లలో రారాజు మామిడి.. మామిడి పండు రుచి మనందరికీ తెలుసు.. మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. మార్కెట్లో అనేక రకాలైన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. అయితే, మామిడి పండ్లు కేవలం రుచి, సువాసన, మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. మామిడి కాయలు, పండ్లు మాత్రమే కాదు.. మామిడి ఆకులు కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మామిడి ఆకులు మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో వస్తున్న చర్మ సమస్యలను నివారించడానికి ఈ ఆకులు ఎంతో ఉపయోగడతాయి. మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మం స్వచ్ఛత, చర్మంపై ట్యాన్‌ను తొలగించేలా పనిచేస్తాయి. చర్మం ఏర్పడే మచ్చలను దూరం చేస్తాయి. ఇందుకోసం మామిడి ఆకులను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించండి.