Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

లవంగంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజు ఒక లవంగం నమలడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అని కూడా అంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది

ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం!
Cloves Benefits 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2025 | 7:32 AM

లవంగంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజు ఒక లవంగం నమలడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అని కూడా అంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లవంగాలు నోటి పూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజూ లవంగం తీసుకుంటే కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. లవంగం నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. లవంగంలో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో లవంగం నమలడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన ఇన్‌ఫెక్షన్ల నుండి పోరాడే శక్తి లభిస్తుంది, రోగ నిరోధక శక్తి లభిస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు లవంగాల్లో అధికంగా ఉండటం వలన ఓరల్ హెల్త్ మెరుగవుతుంది. లవంగాల్లో సంప్రాదాయమైన ఔషధ గుణాలున్నాయి. దీని వలన పంటి నొప్పి,ఓరల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. లవంగాల్లో జీర్ణ శక్తి పెంచే ఎంజైమ్స్ ఉంటాయి, దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగం నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.

లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. లవంగంలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో యుగెనల్‌ ఉంటుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది క్రమంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. లవంగాలని తీసుకుంటే ఆర్ధ్రరైటీస్‌, గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలను నివారిస్తాయి.

లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. లవంగాలు తింటుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. లవంగాలు తింటుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.