Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ABC Juice: ఏబీసీ జ్యూస్ రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే వాటి ప్రభావం నేరుగా మీ ఆరోగ్యంపై ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి కావాల్సిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవాలని చెబుతారు. మీకు మంచి ఆరోగ్యం కావాలంటే కొన్ని రకాల జ్యూస్‌లను

ABC Juice: ఏబీసీ జ్యూస్ రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Beetroot Juice
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2025 | 10:50 PM

మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే వాటి ప్రభావం నేరుగా మీ ఆరోగ్యంపై ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి కావాల్సిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవాలని చెబుతారు. మీకు మంచి ఆరోగ్యం కావాలంటే కొన్ని రకాల జ్యూస్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయల జ్యూస్‌లలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. ఫ్రూట్ జ్యూస్ లు అందరూ తాగుతారు. కానీ.. వాటికంటే ఏబీసీ జ్యూస్ మరింత మంచిది. ప్రతి ఒక్కరూ రోజూ ఏబీసీ జ్యూస్ తాగాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ జ్యూస్‌లో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి. అయితే, ఈ జ్యూస్‌తో కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి?:

ఏబీసీ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెబుతారు. ఏబీసీ అంటే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమం మీ ఆరోగ్యానికి అవసరమైన చాలా పోషకాలను అందిస్తుంది. మీరు 100 ml ఏబీసీ జ్యూస్ తాగితే 45-50 కేలరీలు, 10-12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8-9 గ్రాముల చక్కెర, 0.5 గ్రాముల ప్రోటీన్, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ శరీరాన్ని శుభ్రపరచడానికి, జీర్ణక్రియ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలు:

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరం శుభ్రపడుతుంది (టాక్సిన్స్ తొలగిపోతాయి). బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్‌లో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపు నిండినట్లు ఉంచుతాయి.

జీర్ణక్రియ, చర్మానికి కూడా దీని వల్ల లాభాలు:

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ముఖంపై వచ్చే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఏబీసీ జ్యూస్ వల్ల నష్టాలు:

అయితే, ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు. ఈ జ్యూస్‌ను ఎక్కువగా తాగడం వల్ల కొంతమందికి గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ జ్యూస్ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. మీకు రక్తపోటు సమస్యలు ఉంటే కూడా వీలైనంత తక్కువగా తీసుకోండి. బీట్‌రూట్ మీ రక్తపోటును మరింత తగ్గిస్తుంది. డైటీషియన్ సలహా మేరకు ఈ జ్యూస్ తాగడం మీకు మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..