Fig Benefits: షుగర్ ఉన్నవారు అంజీర్ పండును ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే జన్మలో వదిలిపెట్టకుండా..

అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మధుమేహం, హైబీపీ రోగులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

Fig Benefits: షుగర్ ఉన్నవారు అంజీర్ పండును ఇలా తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే జన్మలో వదిలిపెట్టకుండా..
Figs Or Anjeer
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2022 | 5:10 PM

అంజీర్ 12 నెలల పాటు లభించే డ్రై ఫ్రూట్. ఈ డ్రైఫ్రూట్ ఎంత రుచిగా ఉంటుందో.. అంతకంటే ఆరోగ్యకరమైనది. తీపి అత్తి పండ్ల(అంజీర్, మేడి)ను రుచిలో అనేక గుణాలు ఉన్నాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ డ్రైఫ్రూట్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. ఇందులో ఉండే పోషకాల గురించి చెప్పాలంటే.. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.అంజీర పండ్లను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మధుమేహం, హైబీపీ రోగులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

చక్కెరను నియంత్రిస్తుంది: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అంజీర పండ్లను తీసుకోవాలి. చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంజీర్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రై ఫ్రూట్‌ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలపడి రోగాలకు దూరంగా ఉంటారు. అంజీర్ పండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల షుగర్ పేషెంట్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది: అంజీర పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అంజీర్ రక్తపోటును నియంత్రిస్తుంది. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అత్తి పండ్లలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీన్ని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫినాల్, ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎండిన అత్తి పండ్లలో ఉంటాయి, ఇవి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.

అంజీర పండ్లు బరువును అదుపులో ఉంచుతాయి: బరువు పెరిగిన వారు ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తింటారు. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అది తిన్నాక ఎక్కువ సేపు తినాలనే కోరిక ఉండదు.

అత్తి పండ్లను ఎలా తినాలి: అత్తి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను రెట్టింపు చేయాలనుకుంటే.. అప్పుడు నానబెట్టిన అత్తి పండ్లను తినండి. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో అంజీర పండ్లను వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. అంజీర్ పండ్లను తినండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో అంజీర పండ్లను.. దాని నీటిని తీసుకుంటే పొట్ట క్లియర్ అవుతుంది.. మీకు ఆకలి వేయదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే