Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో కిడ్నీలో రాళ్లా.. ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలి.. చికిత్స విధానం ఇదే..
గర్భిణీల్లో తరచూ వచ్చే సమస్యల్లో కిడ్నీలో రాళ్లు కూడా ఉండటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. గర్భంతో ఉన్న సమయంలో కిడ్నీలో రాళ్లు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది

గర్భిణీల్లో తరచూ వచ్చే సమస్యల్లో కిడ్నీలో రాళ్లు కూడా ఉండటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. గర్భంతో ఉన్న సమయంలో కిడ్నీలో రాళ్లు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా కడుపులో నొప్పి రావడం వల్ల గర్భిణీలు విలవిలలాడిపోతారు. అంతేకాదు కిడ్నీలో రాళ్లను ముందుగానే గుర్తించి చికిత్స పొందితే మంచిది లేకపోతే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది థెరపిస్టులు కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయడానికి సహజ పద్ధతులను ఉపయోగిస్తారు. నొప్పులు ఎక్కువగా పెరిగితే కొన్నిసార్లు సర్జరీ కూడా చేస్తారు. ప్రెగ్నెన్సీలో కిడ్నీలో రాళ్లు ఉంటే ఇతర రకాల సమస్యలు కూడా రావచ్చు.
గర్భధారణ సమయంలో మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తిస్తే ముందుగా మందుల ద్వారా వాటిని కరిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. అయితే రాయి సైజు మరి ఎక్కువగా ఉంటే సర్జరీ చేసేందుకు మగ్గుచూపుతారు అయితే గర్భధారణ సమయంలో లేజర్ సర్జరీ చేయడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది బిడ్డ ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కావున సహజ పద్ధతిలోనే కిడ్నీలో నుంచి రాళ్ళను తొలగించే అవకాశం ఉంటుంది.
సాధారణ డెలివరీ:




కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటికీ మరి ప్రమాదకరం కాకపోతే డెలివరీ వరకూ ఆగే అవకాశం ఉంటుంది. అయితే గర్భంలో శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు, లేకపోతే సిజేరియన్ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. కొన్నిసార్లు, వైద్యులు కిడ్నీలో రాళ్ల నొప్పి ప్రమాదాన్ని తగ్గించడానికి ముందస్తు డెలివరీని ఆదేశించవచ్చు.
ఇంటి చికిత్సలు:
>> కిడ్నీలో రాళ్ల సమస్య ల వల్ల గర్భధారణ సమయంలో స్త్రీలకు దురద సమస్య కూడా ఉంటుంది. ఈ దురద నుండి బయటపడటానికి, మీరు గోరువెచ్చని నీటిని తాగవచ్చు. కానీ మీ బిడ్డకు హాని కలిగ కుండా, అధిక వేడి నీటిని ఉపయోగించకూడదు.
>> వైద్యుల సలహా మేరకే మీరు డైట్ కూడా పాటించాల్సి ఉంటుంది. ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం తీసుకోవాలి. అదేవిధంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా డ్రై ఫ్రూట్స్, అలాగే పళ్ల రసాలను తీసుకునేందుకు ప్రయత్నించండి.
>> తరచూ మంచినీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గే అవకాశం ఉంది. నాటు వైద్యాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఎందుకంటే నాటు వైద్యం పేరిట తాగించే కషాయం పసరు వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది
>> కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న గర్భిణీలు తరచూ డాక్టర్ పరీక్షలకు వెళుతూ ఉండాలి డాక్టర్ సలహా మేరకే మందులు అదేవిధంగా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నడుము నొప్పి కడుపునొప్పి కలిగినప్పుడల్లా డాక్టర్ వద్దకు వెళితే మంచిది. . నెలలో నిండేకొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అనుమానం కలిగిన ఆసుపత్రికి వెళ్లేందుకు వెనకాడ వద్దు. ప్రెగ్నెన్సీ తర్వాత డాక్టర్ సలహా మేరకు కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవాలి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం