AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: కండ్లకలక బాధిస్తోందా.. అయితే, ఈ ఇంటి చిట్కాలతో సమస్య చిటికెలో మాయం..

కంటిలో చిన్న నలక పడ్డా మనం పడే బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Care: కండ్లకలక బాధిస్తోందా.. అయితే, ఈ ఇంటి చిట్కాలతో సమస్య చిటికెలో మాయం..
Bloodshot Eyes
Madhavi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 24, 2023 | 9:27 AM

Share

కంటిలో చిన్న నలక పడ్డా మనం పడే బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా మీ దినచర్య ప్రభావితం అయితే చాలామందిలో కళ్ళకు సోకే ఇన్ఫెక్షన్ కారణంగా కళ్ళు ఎర్రగా మారుతాయి. దీన్నే కండ్ల కలక అని కూడా అంటారు ఈ వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా మారిపోతాయి అలాగే రక్తపు చారలతో కనిపిస్తుంటాయి. దీంతో పాటు మంట కూడా ప్రారంభం అవుతుంది. మరి ఈ కండ్ల కలక వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అసలు ఈ కండ్ల కలక వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

కండ్లకలక ఎందుకు వస్తుంది?:

ఇది షాంపూ, తరచూ వాడే లెన్సులు, ధూళి కారణంగా వస్తుంది.అలాగే కండ్ల కలక ఇన్ఫెక్షన్ వెనుక బ్యాక్టీరియా, వైరస్, అలెర్జీ, ఫంగస్ కూడా ఫలితం అవుతుంటాయి.ఈ సమస్య కొన్ని సార్లు దీర్ఘకాలికంగా ఉంటుంది. కండ్లకలక సాధారణంగా 1 నుండి 2 వారాల వరకు ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఈ ఇన్ఫెక్షన్ 4 వారాల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కండ్ల కలకకు సంబంధించి కొన్ని మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉన్నాయి. అందులో ఒకటి – మీరు కండ్లకలక ఉన్న వ్యక్తి కంటిలోకి చూస్తే, అది మీకు కూడా సోకుతుందనే నమ్మకంగా చాలా మందిలో ఉంటుంది. నిజానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో కలక అనేది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అవుతుంది. అయితే ఇది అంటువ్యాధి అని మాత్రం చెప్పవచ్చు ఉదాహరణకు కండ్ల కలక ఉన్న వ్యక్తి తన కళ్లను, ఒక గుడ్డ లేదా కర్చీఫ్ తో తుడుచుకుంటే, ఆ కర్చీఫ్ ని మీరు వాడినట్లయితే మీకు కండ్ల కలక సోకే ప్రమాదం ఉంటుంది . అలాగే కండ్ల కలక ఉన్న వ్యక్తి కళ్ళను నులుముకొని అదే చేతులతో మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లయితే, మీకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది

కండ్లకలక ఎలా వ్యాపిస్తుంది?

CDC ప్రకారం ఈ వ్యాధిని వైరల్ కన్జక్టివిటిస్ అని అంటారు. ఇది ఒక అంటువ్యాధి. ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి కళ్ళతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కన్నీళ్లు, శ్వాసకోశంలో కూడా ఉంటుంది. ఉన్న వ్యక్తి మాట్లాడే సమయంలో నోటి ద్వారా వచ్చే తుంపర్ల లో ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కంటిచూపు వల్ల కండ్లకలక వస్తుందా?

కండ్లకలక అంటువ్యాధి అయితే ఈ వ్యాధి ఉన్నవారి కళ్లను చూడటం ద్వారా వ్యాపించదు. ఇది ప్రధానంగా చేతుల ద్వారా వ్యాపిస్తుంది. మీరు వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా మాత్రమే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

ఇక కండ్లకలక చికిత్స విధానానికి వస్తే:

– కండ్ల కలక సోకిన వ్యక్తి తరచూ చల్లటి నీటితో కళ్ళను కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా కంటి నరాలు ఉపశమనం పొందుతాయి. వీలైతే ఐస్ నీళ్లతో కళ్ళను కడుక్కుంటే చాలా మంచిది.

– ఆయుర్వేదం ప్రకారం కళ్ళలో కొద్దిగా పచ్చ కర్పూరం వేసుకుంటే కంటికి తగిలిస్తే బ్యాక్టీరియా వైరస్ శుభ్రం చేసుకునే అవకాశం ఉంది.

– కండ్ల కలక సోకిన వ్యక్తి పుష్కలంగా మంచి నీళ్లు తాగాలి, అలాగే ఆరోగ్యకరమైన డైట్ విధానాలను పాటించాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం