AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Care: వేసవి కాలంలో ఈ ఆహారాలు అస్సలు తినొద్దు.. ఆరోగ్యం దెబ్బతింటుంది..!

ఈసారి ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా.. సమ్మర్‌లో మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి.

Summer Health Care: వేసవి కాలంలో ఈ ఆహారాలు అస్సలు తినొద్దు.. ఆరోగ్యం దెబ్బతింటుంది..!
No To Junk Food
Shiva Prajapati
|

Updated on: May 24, 2023 | 10:04 AM

Share

ఈసారి ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా.. సమ్మర్‌లో మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. మరి వేసవికాలంలో ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవిలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి:

1. వేయించిన ఆహారాలు: డీప్‌ఫ్రైడ్ ఫుడ్స్‌ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. కానీ వేసవిలో వేయించిన పదార్ధాలు తినడం వల్ల నీరసం, కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

2. స్పైసీ వంటకాలు: వేసవిలో కారం ఎక్కువగా ఉండే వంటకాలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక చెమట పట్టవచ్చు. చల్లగా, సౌకర్యవంతంగా ఉండటానికి.. తేలికపాటి వంటకాలను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

3. కార్బోనేటేడ్ డ్రింక్స్: కార్బోనేటేడ్ డ్రింక్స్ వేసవిలో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ డ్రిక్స్‌లో అధిక స్థాయిలో చక్కెర, కృత్రిమ రంగులు ఉంటాయి. వీటికి బదులుగా.. నీరు, సహజ పండ్ల రసాలు, హెర్బల్ టీలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.

4. డెజర్ట్‌లు: క్రీమీ డెజర్ట్‌లు వేసవిలో ఉబ్బసంగా, ఇబ్బందిగా అనిపిస్తాయి. దీని బదులుగా.. తాజా పండ్ల సలాడ్‌లు, పెరుగు, సోర్బెట్‌లు వంటి తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

5. రెడ్ మీట్(మాంసం): వేసవిలో మాంసాహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. దీనికి బదులుగా చేపలు వంటి తేలికపాటి ప్రోటీన్ పదార్థాలను తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అధిక వేడి లేకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

6. కెఫిన్: ఇది వేసవిలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కెఫీన్ తీసుకోవడం పరిమితం చేయాలి. దీనికి బదులుగా హెర్బల్ టీలు, తాజా పండ్ల రసాలు వంటి డ్రింక్స్ తాగడం ఉత్తమం.

7. సోడియం అధికంగా తీసుకోవడం: వేసవిలో సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. వేసవి వేడిని తట్టుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినడం మంచిది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌