Health Tips: కిడ్నీలో రాళ్లు.. తీవ్రమైన సమస్యకు ఈ 3 సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..!
Natural kidney care: కిడ్నీలోని రాళ్లు.. పెద్ద సమస్య కాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను మొదట్లోనే పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన కిడ్నీల్లో రాళ్లను కరిగించే లేదా బయటికి పంపించే సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో కిడ్నీలలో రాళ్లు అనేది సాధారణంగా మారిపోయింంది. మారుతన్న జీవనశైలి, తీసుకునే ఆహారం, తదితర కారణాలతో చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. రాళ్లు పెద్దవిగా ఉంటే కిడ్నీ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే కిడ్నీలోని రాళ్లు.. పెద్ద సమస్య కాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను మొదట్లోనే పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన కిడ్నీల్లో రాళ్లను కరిగించే లేదా బయటికి పంపించే సులభమైన మార్గాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించవచ్చని వైద్యారోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
1. రోజూ సరిపడా నీరు తాగండి
నీటితో నీరు తాగడం వల్ల మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రంలో ఖనిజాల సాంద్రత తగ్గుతుంది. డాక్టర్ సూచన ప్రకారం రోజుకు కనీసం 2.5 లీటర్ల వరకు నీరు తాగడం మంచిది. నీరు తాగడం ద్వారా చిన్న క్రిస్టల్స్(రాళ్లు) పెద్దవికాక ముందే బయటకు పోతాయి, అందువల్ల రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.
2. ఉప్పు తక్కువగా తీసుకోండి
ఎక్కువ సోడియం (ఉప్పు) ఉండే ఆహారం తీసుకుంటే కిడ్నీలు మీ శరీరంలో ఉన్న కాల్షియం ఎక్కువగా మూత్రంలో రిలీజ్ చేస్తాయి. ఈ కాల్షియం కిడ్నీ స్టోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం కావచ్చు. అందుకే ఉప్పు ఒక్క చెంచా (సుమారు 5 గ్రాముల) కంటే ఎక్కువ తీసుకోవద్దు. పరిశోధనలు కూడా ఉప్పు తగ్గించడం వల్ల రాళ్ల సమస్య తగ్గిందని చెబుతున్నాయి.
3. సిట్రేట్లు ఉన్న పండ్లు ఎక్కువగా తినండి
నిమ్మకాయ, ఆరెంజ్, మోసంబి వంటి సిట్రేట్ పండ్లు కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. సిట్రేట్ కల్పించే ఆహారం కాల్షియాన్ని క్రిస్టల్ రూపంలో ఉండకుండా, మూత్రంలో కదలికగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకి, నిమ్మరసం నీటిలో కలిపి ఉదయం మధ్యలో తాగటం చాలా మంచిది.
ఇంకా ఏమి చేయాలి?
కేవలం ఇవే కాకుండా.. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు (టమాట, పాలకుర, బీట్ రూట్ వంటి) ని పరిమితం చేయండి. ఎక్కువ రెడ్ మీట్ లేదా అధిక ప్రోటీన్ ఆహారం తగ్గించండి (యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది). నీటితో పాటు నిమ్మకాయ కలిపిన నీటిని రోజులో ఎక్కువసార్లు తీసుకోండి.
