AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఈ నాలుగు రకాల నూనెలతో మసాజ్‌ చేయండి చాలు..

కొన్ని రకాల నూనెల సహాయంతో.. ఎముకలు, కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.. దీంతోపాటు ఎముకలు బలపడతాయి.

Bone Health: ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఈ నాలుగు రకాల నూనెలతో మసాజ్‌ చేయండి చాలు..
Bones
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2022 | 10:01 AM

Share

Build Healthy Bones Tips: ఎముకలు బలహీనపడటం అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు కూడా ప్రభావితమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించనప్పుడు లేదా వ్యాయామం చేయకపోతే.. ఎముకలలో నొప్పి, బలహీనపడటం లాంటి సమస్యలు కనిపిస్తాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడడానికి ఇదే కారణం. అయితే.. కొన్ని రకాల నూనెల సహాయంతో.. ఎముకలు, కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.. దీంతోపాటు ఎముకలు బలపడతాయి. కాబట్టి ఎముకలను పటిష్టం చేసే నాలుగు నూనెల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె

ఆవనూనె ఎముకలను బలోపేతం చేయడంలో చాలా మేలు చేస్తుంది. శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా కీళ్ల నొప్పులకు కూడా ఈ నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవచ్చు. మీరు దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

బాదం నూనె

బాదం నూనె కూడా మీ ఎముకలను బలంగా చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఇ ఉంది. ఇది అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతంది.

నువ్వుల నూనె 

శరీరానికి నువ్వుల నూనెతో కూడా మసాజ్ చేయవచ్చు. దీని వల్ల కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ శరీరం ఆరోగ్యవంతంగా మారడంతోపాటు.. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనెతో కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఉపయోగించడం ద్వారా మీరు శరీర నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెతో శరీరానికి క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవాలి.

కీళ్ల నొప్పులు, శరీర నొప్పులకు ఈ నాలుగు రకాల నూనెలతో మసాజ్ చేసుకుంటే.. మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..

Muskmelon Benefits: వేసవిలో కర్బూజను తింటున్నారా..? అయితే.. ఈ విషయాలపై లుక్కేయాల్సిందే..