AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: బరువు తగ్గే సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్.. ఎంత ఈజీ అని తెలిస్తే షాకవుతారు!

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధికబరువు. బరువు నియంత్రణ కోసం రకరకాల టిప్స్​, డైట్స్​ ఫాలో అవుతూ చాలా కష్టపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ అంటే జిమ్‌లో చెమటోడ్చడం, డైట్ పేరుతో కడుపు మాడ్చుకోవడం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఒక స్టార్ హీరోయిన్​ ..

Janhvi Kapoor: బరువు తగ్గే సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్.. ఎంత ఈజీ అని తెలిస్తే షాకవుతారు!
Janhvi Kapoor
Nikhil
|

Updated on: Nov 22, 2025 | 10:34 AM

Share

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధికబరువు. బరువు నియంత్రణ కోసం రకరకాల టిప్స్​, డైట్స్​ ఫాలో అవుతూ చాలా కష్టపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ అంటే జిమ్‌లో చెమటోడ్చడం, డైట్ పేరుతో కడుపు మాడ్చుకోవడం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఒక స్టార్ హీరోయిన్​ మాత్రం ఒక సింపుల్ ఈటింగ్ హ్యాక్‌తో ఈ సమస్యకు సొల్యూషన్ ఇచ్చింది.

కష్టపడి వర్కౌట్ చేయకుండా, కేవలం ఒక చిన్న హ్యాబిట్ మార్చడంతోనే బరువు కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చని చెబుతోంది. స్టార్​ హీరోయిన్​ చెప్పిన ఈ సీక్రెట్ వైరల్ అవుతోంది, ఎందుకంటే అది సైన్స్ బ్యాక్డ్, ఈజీ టు ఫాలో. ఈ హ్యాక్ ఆమె స్లిమ్ ఫిగర్‌కు కీలకమైనది, మరి మీరు కూడా ట్రై చేస్తారా?

ఏంటా సీక్రెట్..

ఆ బాలీవుడ్​ బ్యూటీ చెప్పిన సీక్రెట్​ ఏంటంటే.. ఆహారాన్ని సరైన పద్ధతిలో తినడం. అంటే నిదానంగా పూర్తిగా ఆహారాన్ని మెత్తగా నమలాలి. ఇంతకీ ఈ హ్యాక్​ చెప్పింది ఎవరనుకుంటున్నారు? ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇటీవల ‘పరమ్ సుందరి’ మూవీ ప్రమోషన్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రోడ్‌సైడ్ స్నాక్స్ తింటూ ఈ హ్యాక్​ని వివరించింది.

చిన్న పోర్షన్‌లలో తీసుకుని, ఒక్కో బైట్‌ను జాగ్రత్తగా నములుతూ తినాలని సూచించింది. ఇదే తన డైట్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది. అదే విషయంపై కాలిఫోర్నియా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పల్ మానిక్కం కూడా మాట్లాడారు. ‘ఒక్కో బైట్‌కు 32 సార్లు నమలాలి. ఎందుకంటే మనకు 32 పళ్లు ఉన్నాయి’ అని ఆయన సూచించారు.

ఆహారాన్ని నెమ్మదిగా నమలడం వల్ల గట్, బ్రెయిన్ మధ్య కమ్యూనికేషన్ మెరుగవుతుంది. వాగస్ నర్వ్ ద్వారా ‘నేను ఫుల్ అయ్యాను’అనే సిగ్నల్స్ వస్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, సాటియేటీ హార్మోన్స్ లాంటి లెప్టిన్ పెరుగుతాయి, హంగర్ హార్మోన్ ఘ్రెలిన్ తగ్గుతుంది. ఫలితంగా, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది, క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి, పోర్షన్ సైజ్ అటోమేటిక్‌గా రెడ్యూస్ అవుతుంది. బెనిఫిట్స్? బెటర్ డైజెషన్, లెస్ క్యాలరీ ఇంటేక్, ఆహారాన్ని మరింత ఎంజాయ్ చేస్తూ తినొచ్చు.. అన్నింటికీ మించి జిమ్ లేకుండానే వెయిట్ లాస్​ అవచ్చన్నమాట!

జాన్వీ డైట్, వర్కౌట్స్​తో బాడీ మెయింటేన్​ చేస్తోంది. కానీ ఈ చూయింగ్ హ్యాక్ ఆమెకు స్పెషల్. ‘చిన్న పోర్షన్‌లు తీసుకుని స్లోగా తినడం వల్ల హంగర్ కంట్రోల్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది. జాన్వీ చెప్పినదానిపై డాక్టర్ మానిక్కం కూడా ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు.

‘15-15-15 రూల్: ఒక బైట్ తీసుకుని 15 సెకండ్స్ నమిలి, 15 సెకండ్స్ పాజ్ ఇవ్వడం, మీల్‌కు కనీసం 15 నిమిషాలు పడేలా చేయడం. ఫోన్ సైడ్‌కి పెట్టి, రిలాక్స్‌గా తినాలి. ఇది ఒక మీల్ (బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్) నుంచి స్టార్ట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు డాక్టర్​ మానిక్కం. మీరు కూడా ఈ సీక్రెట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి!

Follow Us
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ అతనే.. ఆ హీరో అంటే నాకు లవ్: అఖిల్
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..
విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు ఏం జరిగింది..