ఆ సమస్యతో బాధపడుతున్నారా..? వీటిని తింటే దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..

రక్తహీనత అనేది ఒక తీవ్రమైన సమస్య.. ఇది శరీరంలో ఐరన్ లోపం కారణంగా సంభవిస్తుంది. దీని వల్ల నిత్యం అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, చిరాకు, జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడడం, ఊపిరి ఆడకపోవడం, నోటిపూత, నిలబడితే కళ్లు తిరగడం, వికారం, లైంగిక కోరికలు కలగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఆ సమస్యతో బాధపడుతున్నారా..? వీటిని తింటే దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..
Iron Deficiency
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 10, 2024 | 10:31 AM

రక్తహీనత అనేది ఒక తీవ్రమైన సమస్య.. ఇది శరీరంలో ఐరన్ లోపం కారణంగా సంభవిస్తుంది. దీని వల్ల నిత్యం అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, చిరాకు, జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడడం, ఊపిరి ఆడకపోవడం, నోటిపూత, నిలబడితే కళ్లు తిరగడం, వికారం, లైంగిక కోరికలు కలగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా, రక్తహీనత 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీలు, రుతుక్రమం ఉన్న స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరం సరిగా పనిచేయడానికి రక్తం చాలా ముఖ్యమైనది. దాని సహాయంతో మాత్రమే ఆక్సిజన్ అన్ని భాగాలకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ కాలం ఇనుము లోపాన్ని విస్మరించడం పెను ప్రమాదంలో పడేలా చేస్తుంది.. మీరు కూడా, రక్తహీనత లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీ ఆహారంలో ఈ 5 ఆహార పదార్థాలను చేర్చుకోండి.. వీటిని రెగ్యులర్ గా తినడం రక్తహీనత సమస్యను అనతి కాలంలోనే అధిగమించవచ్చు..

ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు వీటిని తినండి..

బీట్‌రూట్: బీట్‌రూట్ శక్తివంతమైన ఐరన్ రిచ్ వెజిటేబుల్. ఇది ఇనుమును కలిగి ఉండటమే కాకుండా, ఫోలేట్, విటమిన్ సికి మంచి మూలం కూడా. బీట్‌రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనిని సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా వెజిటబుల్‌గా తినవచ్చు.

ఎరుపు కిడ్నీ బీన్స్: రెడ్ కిడ్నీ బీన్స్ (బీన్స్) ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అద్భుతమైన మూలం. శాకాహారులు ఇనుము లోపాన్ని అధిగమించడానికి ఇది ఉత్తమ ఎంపిక, ఎందుకంటే ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్, ఇనుము రెండింటినీ కలిగి ఉంటుంది. కిడ్నీ బీన్స్‌ను కూరగాయలు లేదా బియ్యంతో తినడం వల్ల మీ రక్తంలో ఐరన్ పరిమాణాన్ని పెంచుతుంది.

బెల్లం: బెల్లం ఒక సహజ స్వీటెనర్.. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు బెల్లంను టీలో చేర్చుకోవడం లేదా మీ అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా సులభంగా తినవచ్చు. ఇది ఇనుమును పెంచడమే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది.

దానిమ్మ: క్రమం తప్పకుండా దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పండులో ఐరన్ పుష్కలంగా ఉండటమే కాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. మీరు దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

రెడ్ క్యాప్సికం: ఇతర పదార్థాలతో పోలిస్తే రెడ్ క్యాప్సికమ్ లో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా లేనప్పటికీ, ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల నుంచి ఇనుము శోషణను పెంచడంలో సహాయపడుతుంది.

వీటితోపాటు.. అంజీర్, తాజా పండ్లు, ఆకుకూరలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇవి కూడా రక్తహీనతను దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!