Grey hair issue: చిన్న వయసులోనే పిల్లల జుట్టు తెల్లబడుతోందా..? ఇలా చేస్తే ఆ సమస్యేలే ఉండవు..
Hair Care Home Remedies: జీవనశైలి, కలుషిత వాతావరణం పెద్దలపైనే కాదు పిల్లలపైనా ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల వారి ఆరోగ్యంతోపాటు చర్మం, వెంట్రుకలు

Hair Care Home Remedies: జీవనశైలి, కలుషిత వాతావరణం పెద్దలపైనే కాదు పిల్లలపైనా ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల వారి ఆరోగ్యంతోపాటు చర్మం, వెంట్రుకలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు కూడా జుట్టు రాలడం, జుట్టు (Hair Care) పొడిబారడం, అకస్మాత్తుగా నెరవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు . జుట్టు నెరసిపోవడం వల్ల మొహం అందం మారిపోతుంది. చాలామందికి గ్రే హెయిర్ అంటే చాలా ఇష్టం అయినప్పటికీ.. చాలా మంది జుట్టు నలుపు రంగును ఇష్టపడతారు. జుట్టు నెరిసిపోవడానికి కారణం ఒత్తిడి, జన్యువుల ప్రభావం, లేదా పోషకాహార లోపం కావచ్చు. పోషకాహార లోపం అయితే.. మనం తినే ఆహారం (Food) ద్వారా ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టొచ్చు.
అయితే.. ఈ జుట్టు సమస్య నుంచి బయటపడటానికి హోం రెమిడీస్ ప్రభావంతంగా పనిచేస్తాయి. దీంతోపాటు పిల్లలకు ఆహారాన్ని మార్చడం ద్వారా పరిష్కరించవచ్చు. కొన్ని ఆహార పదార్థాల ద్వారా చిన్నారుల జట్టు సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. వీటిని పిల్లల ఆహారంలో భాగం చేయడం ద్వారా ఈ జుట్టు సమస్యను నివారించవచ్చు. (Hair Care Tips) అవేంటో ఇప్పుడు చూద్దాం..
గుడ్డు ఇది పిల్లల ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారం. ఇందులో ఉండే ప్రొటీన్ ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. మీరు, మీ పిల్లలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే, వారానికి కనీసం మూడు సార్లు గుడ్లు తినండి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య దూరమై జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇది మాత్రమే కాదు, అనేక డ్రై ఫ్రూట్స్‌లో కూడా రాగి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీకు కావాలంటే, మీరు పిల్లల ఆహారంలో బాదం, వాల్‌నట్‌లను చేర్చవచ్చు. ఎందుకంటే వాటిలో మెలనిన్‌ను పెంచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
ఆకు కూరలు కూరగాయలలో ముఖ్యంగా ఆకు కూరల్లో విటమిన్ ఇ, సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం, వెంట్రుకల ప్రదేశాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వాస్తవానికి తలలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల జుట్టు రాలడం, అకాలంగా నెరవడం మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితిలో పిల్లలు ఖచ్చితంగా ఆకు కూరలు తినాలంటున్నారు నిపుణులు.
పప్పుధాన్యాలు పప్పుధాన్యాల్లో ప్రోటీన్లు, విటమిన్ B9 పుష్కలంగా లభిస్తాయి. ఆర్ఎన్ఏ, B9 ఉత్పత్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. చాలా మంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీని వల్ల కూడా జుట్టు చాలా పాడైపోతుంది. కావాలంటే పప్పును విడిగా, రుచిగా చేసి పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది.
Also Read:




