Child Addicted Phone: పిల్లలు మొబైల్‌కి బానిసయ్యారా.. దారి మరల్చడానికి ఇలా చేయండి..!

|

May 22, 2022 | 9:07 PM

Child Addicted Phone: నేటి కాలంలో పిల్లలు, ఫోన్‌లు, గాడ్జెట్లని ఎక్కువగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. అంతేకాదు ఒక్కోసారి ఈ పరిస్థితిని

Child Addicted Phone: పిల్లలు మొబైల్‌కి బానిసయ్యారా.. దారి మరల్చడానికి ఇలా చేయండి..!
Child Addicted Phone
Follow us on

Child Addicted Phone: నేటి కాలంలో పిల్లలు, ఫోన్‌లు, గాడ్జెట్లని ఎక్కువగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. అంతేకాదు ఒక్కోసారి ఈ పరిస్థితిని చూసి పిల్లల్ని మందలించిన సందర్భాలు కూడా ఉంటాయి. అయినా పిల్లలు వారి మాటలని లెక్క చేయరు. ఎందుకంటే వారు వాటికి బానిసగా మారుతారు. ఈ గాడ్జెట్లు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఫోన్, టీవీల రిమోట్‌నే తమ ప్రపంచంగా భావిస్తారు. ఇంట్లో వారి నుంచి ఈ వస్తువులను లాక్కోవడం లేదా గొడవ చేయడం జరుగుతుంది. పిల్లల ఈ వ్యసనాన్ని ఎలా తగ్గించాలా తెలియక తల్లిదండ్రులు మదనపడుతుంటారు. ఒక్కోసార ఏం చేయాలో తెలియక పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. కానీ ఈ పద్ధతి వారిని మరింత మొండిగా చేస్తుంది. అలా కాకుండా కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా పిల్లలని వాటి నుంచి కాపాడవచ్చు.

పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పడం

ఫోన్ లేదా టీవీ అలవాటును వదిలించడానికి పిల్లలకు శారీరక శ్రమ పనులను చెప్పవచ్చు. మార్కెట్ నుంచి సరుకులు తీసుకురమ్మనడం, వ్యాయామానికి వెళ్లేటప్పుడు వారిని తీసుకువెళ్లడం, ఆటలవైపు వారిని మళ్లించేలా చేయడం ముఖ్యం. దీనివల్ల పిల్లలు ఫోన్ల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పార్కులకి వెళ్లడం

వేసవి సెలవుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను వేడి కారణంగా ఇంట్లోనే ఉండమంటారు. ఇది ఆరోగ్యం పరంగా మంచిది కాదు. పిల్లలు ఇంట్లో ఉంటే ఫోన్‌లో మునిగిపోతారు. ఈ పరిస్థితిలో మీరు వారిని పార్కుకు తీసుకెళ్లి అక్కడున్న ఆట వస్తువులని పరిచయం చేస్తే మంచిది.

ప్రేమతో వివరించండి

పిల్లల నుంచి ఫోన్ లాక్కోవడం లేదా టీవీ ఆఫ్ చేయడం వంటి విషయాల్లో తల్లిదండ్రులు కొంచెం కఠినంగా ఉంటారు. ఈ పద్ధతి అతనిని కొన్ని క్షణాలపాటు ఫోన్ నుంచి దూరంగా తీసుకువెళుతుంది. కానీ పిల్లవాడు మీ పట్ల కోపంగా మారుతాడు. బదులుగా పిల్లవాడిని కొంత ప్రేమతో సర్ది చెప్పేలా చూసుకోండి. ఫోన్‌ నష్టం గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటాడు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి