Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Side Effects: ఆ టైమ్‌లో పాలు తాగితే ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

ఉదయాన్నే పరగడుపున పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఏదైనా తిన్న తర్వాత మాత్రమే పాలు తాగాలి.

Milk Side Effects: ఆ టైమ్‌లో పాలు తాగితే ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
Milk Side Effects
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2023 | 7:55 AM

సంపూర్ణ పోషకాహారం చెప్పుకునే పాలు మన శరీరానికి బలన్నిస్తాయి. కాల్షియం పుష్కలంగా ఉన్నందున పాలు ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఇక చాలా మంది పాలు తాగడం తోనే తమ రోజును ప్రారంభిస్తారు. కొంతమంది తమ దినచర్యలో భాగంగా పాలు తీసుకుంటారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న పాలు తాగడానికి కూడా ఒక సమయం ఉందని మీకు తెలుసా? అప్పుడే అది మీకు అందులోని ప్రయోజనాలు శరీరానికి  అందుతాయయి. ఒకవేళ మీరు సరైన సమయంలో ఏదైనా తినకపోతే, దాని నుండి ప్రయోజనం పొందే బదులు ప్రతికూల ఫలితాలను పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఏదైనా వాడుకోవడానికి ఒక సమయం ఉంటుంది. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ సమయంలోనైనా ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల సమస్యలు వస్తాయి. ఉదయాన్నే పరగడుపున పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఏదైనా తిన్న తర్వాత మాత్రమే పాలు తాగాలి. అయితే చిన్న పిల్లలకు అలా కాదు, రోజులో ఎప్పుడైనా పాలు తాగవచ్చు. వృద్ధులు ఉదయం పాలు తాగకూడదు.

రాత్రిపూట మాత్రమే..

  • వృద్ధులు రాత్రి పడుకునే గంట ముందు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపరడడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
  • మీకు మలబద్ధకం లేదా గ్యాస్ సమస్య ఉంటే రాత్రిపూట మాత్రమే పాలు తాగండి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు రోజంతా మీ అలసటను దూరం చేస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపోతారు.
  • రాత్రిపూట పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, మధ్యాహ్న భోజనంలో పాలు కూడా తాగవచ్చు. మరోవైపు పాలలో పసుపు కలిపి వాడటం ఆరోగ్యానికి మరింత మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి