Exercising Side Effects: వ్యాయామం సమయంలో ఈ 6 లక్షణాలుంటే.. గుండె సమస్యలున్నట్టే!!

బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని, కండలు పెరగాలని.. ఇలా చాలామంది జిమ్ లకు క్యూ కడుతున్నారు. కానీ పైకి ఎంత ఫిట్ గా కనిపించినా.. వ్యాయామం చేస్తూనే ఇటీవల కాలంలో కొందరు గుండెపోటుతో మరణించారు. వారిలో ఎక్కువశాతం యువతే ఉన్నారు. ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకి గురై మరణించడం వెనుక కారణాలేంటి అన్నది ఆరా తీస్తే.. పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉండొచ్చని, ఎక్కువగా బిర్యానీలు తినడం, ఆల్కహాల్ తీసుకోవడం కావొచ్చని అన్నారు వైద్యులు. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా..

Exercising Side Effects: వ్యాయామం సమయంలో ఈ 6 లక్షణాలుంటే.. గుండె సమస్యలున్నట్టే!!
Exercising Side Effects
Follow us
Chinni Enni

|

Updated on: Aug 16, 2023 | 1:08 PM

బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని, కండలు పెరగాలని.. ఇలా చాలామంది జిమ్ లకు క్యూ కడుతున్నారు. కానీ పైకి ఎంత ఫిట్ గా కనిపించినా.. వ్యాయామం చేస్తూనే ఇటీవల కాలంలో కొందరు గుండెపోటుతో మరణించారు. వారిలో ఎక్కువశాతం యువతే ఉన్నారు. ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకి గురై మరణించడం వెనుక కారణాలేంటి అన్నది ఆరా తీస్తే.. పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉండొచ్చని, ఎక్కువగా బిర్యానీలు తినడం, ఆల్కహాల్ తీసుకోవడం కావొచ్చని అన్నారు వైద్యులు. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా.. మాకేం రోగాలుండవ్ అనుకుంటే మాత్రం పొరపాటే. వ్యాయామం చేసేటపుడు మీకు ఈ లక్షణాలు కనిపిస్తే.. మీకు కూడా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించండి.

అలసట ఎక్కువగా ఉండటం:

జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో సాధారణం కంటే ఎక్కువ అలసటగా ఉంటే కనుక వెంటనే వ్యాయామం చేయడం ఆపండి. అధిక అలసట ఉంటే.. అది మీకు గుండె సమస్య ఉందనడానికి సంకేతం. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను నిరోధిస్తుంది. ఫలితంగా రక్తపోటును ప్రభావితం చేయడం ద్వారా గుండె సమస్య వస్తుంది.

ఇవి కూడా చదవండి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

వ్యాయామం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ.. రోజూ ఉండే ఇబ్బంది కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే గనుక.. అది గుండె సమస్యకు కారణమవుతుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే వర్కౌట్ ను ఆపివేయాలి. లేదంటే అది హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.

గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవడం:

జిమ్ లో వర్కౌట్స్ చేసేటపుడు గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటే.. మీకు గుండెకు ప్రమాదం పొంచి ఉందని అర్థం. అసౌకర్యంగా ఉన్నా, ఛాతీలో నొప్పి వచ్చినా, ఎడమవైపు శరీర భాగాల్లో మార్పు కనిపించినా.. కొద్దిసేపు వర్కౌట్స్ ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ఛాతీలో నొప్పి:

వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి వస్తే అది గుండెపోటుకు సంకేతంగా భావించాలి. ఛాతీలో నొప్పిని అంత తేలికగా తీసిపారేయడం మంచిది కాదు. వెంటనే వ్యాయామం ఆపివేసి.. వైద్యుల్ని సంప్రదించాలి. అదే తగ్గిపోతుందిలే అని మొండిగా వ్యవహరిస్తే.. అది మీ ప్రాణానికే ప్రమాదం కావొచ్చు.

తల తిరగడం:

వర్కౌట్స్ చేసే సమయంలో కళ్లు తిరగడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటి సమస్యలు గాని కనిపిస్తే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అర్థం. ఇలా అనిపిస్తే గనుక వెంటనే వర్కౌట్స్ ఆపి రెస్ట్ తీసుకోవాలి. తగ్గకపోతే సమీపంలోని వైద్యుల్ని సంప్రదించాలి.

డీ హైడ్రేషన్:

జిమ్ చేసేటపుడు కొందరు డీ హైడ్రేషన్ కు గురవుతారు. వ్యాయామం చేయడం వల్ల అలా జరుగుతుందని అనుకుంటారు కానీ.. ఈ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం అది శరీరంలో లోపంగా గుర్తించాలి. పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లను కోల్పోయినపుడు డీ హైడ్రేషన్ కు గురవుతారు. ఇలా జరిగినపుడు హార్ట్ బీట్ సమస్య తలెత్తుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి