వామ్మో.. మీకు ఆ సమస్య ఉంటే పొరపాటున కూడా వీటిని తినకండి.. డైరెక్టుగా షెడ్డుకు వెళతారు జాగ్రత్త
హై బీపీ (హైపర్‌టెన్షన్) ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి కారణంగా రక్తపోటు సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. హైపర్‌టెన్షన్ రోగులు ఏమి తినాలి? ఎలాంటి పదార్థాలు తినకూడదు? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య (అధిక రక్తపోటు) నిరంతరం పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా.. చెడు జీవనశైలి, అసమతుల్య ఆహారం కారణంగా హై బీపీ సమస్య వేగంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. హై బీపీ ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే అనేక రోగాలకు కారణమవుతుంది. గుండె సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పక్షవాతం వచ్చే ప్రమాదం వంటి సమస్యలు పెరుగుతాయి..
అయితే.. అధిక బిపి ఉన్నవారు తరచుగా మందులపై ఆధారపడతుంటారు.. కానీ మంచి జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు. అటువంటి పరిస్థితిలో.. రోగులు ఏమి తినాలి, ఏమి తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం..
హైపర్ టెన్షన్ ఉన్న రోగులు కొన్ని పదార్థాలు తినకూడదు. అలాకాకుండా ప్రజలు నివారించదగిన వాటిని తింటే.. రక్తపోటు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. రక్తపోటు అధికంగా ఉండే రోగులు ఎలాంటి ఆహారం తినకూడదు.. నిపుణులు ఏం చెబుతున్నారో.. తెలుసుకోండి..
ప్రాసెస్ చేసిన ఆహారం..
అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్‌లో లభించే చిప్స్, నామ్‌కీన్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం వల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. హైపర్ టెన్షన్ రోగులు శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు.
అధికంగా ఉప్పు తీసుకోవడం
హైపర్ టెన్షన్ ఉన్న రోగులు ఉప్పు ఎక్కువగా తినకూడదు. అధిక బీపీ ఉన్న వారికి ఉప్పు ప్రమాదకరం. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది.. ఇది రక్తపోటును వేగంగా పెంచుతుంది. కాబట్టి రోగులు సరిపోయేంత ఉప్పు మాత్రమే తీసుకోవాలి.. ఇంకా అదనపు ఉప్పుకు దూరంగా ఉండాలి.
చక్కెర – స్వీట్లు..
హైపర్‌టెన్షన్ ఉన్నవారు తీపి పదార్థాలు తినకుండా ఉండాలి. స్వీట్ల వల్ల షుగర్ లెవెల్ వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మీ బరువు పెరిగి గుండెపై మరింత భారం పడుతుంది.
టీ – కాఫీ..
టీ – కాఫీలలో కెఫిన్ పెద్ద పరిమాణంలో లభిస్తుంది. కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. అందువల్ల ఒక రోజులో 2 కప్పుల టీ లేదా 1 కప్పు కాఫీ తాగాలి. దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది.
హైబీపీ (హైపర్‌టెన్షన్) లో ఏమి తినాలి?..
ప్రస్తుత కాలంలో పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా రక్తపోటు వ్యాధి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత బీపీతోపాటు.. అనేక సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే యువత జీవనశైలి పూర్తిగా దిగజారుతోంది. దీంతో వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, రక్తపోటు రోగులు వారి BP (బ్లడ్ ప్రెజర్) నియంత్రణలో ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి.. హైపర్ టెన్షన్ రోగులు తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తగిన మొత్తంలో కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. నూనె, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి..
పండ్లు – ఆకుకూరలు, కూరగాయలు: రక్తపోటు ఉన్నవారు తాజా పండ్లను తీసుకోవాలి. నారింజ, పుచ్చకాయ, అరటి, బొప్పాయి వంటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో బచ్చలికూర, పాలకూర లాంటి ఆకుకూరలు.. అలాగే బ్రోకలీ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలలో ఖనిజాలు ఎక్కువగా కనిపిస్తాయి.. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, ఈ రోగులు అధిక పరిమాణంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి.
తృణధాన్యాలు: బీపీ రోగులు తృణధాన్యాలు తినాలి. వోట్స్, బ్రౌన్ రైస్, గింజలు, పెసర, పప్పుధాన్యాలు, ఇతర తృణధాన్యాలలో తగినంత మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో ఫైబర్ సహకారాన్ని అందిస్తుంది.. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గింజలు: ఈ రోగులు వారి ఆహారంలో గింజలను కూడా చేర్చుకోవాలి. వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు వంటివి తీసుకోవాలి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు విత్తనాలలో కనిపిస్తాయి.. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..