AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Pain Relief: మెడ నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి మాయం అవుతుంది..!

రోజూ మనలో చాలా మందికి మెడ నొప్పి సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగుల్లో ఈ నొప్పి సాధారణంగా కనిపిస్తుంది. కొందరికి తేలికపాటి నొప్పి ఉన్నా, మరికొందరికి అది తీవ్రంగా ఉండి పని చేయలేని స్థితికి దారి తీస్తుంది. అసలు ఈ నొప్పికి కారణాలు ఏంటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇంట్లోనే సులువుగా దీన్ని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Neck Pain Relief: మెడ నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి మాయం అవుతుంది..!
Neck Pain Relief
Prashanthi V
|

Updated on: Jun 02, 2025 | 4:00 PM

Share

రోజూ చేసే పనులు, సరిగా లేని భంగిమ, ఎక్కువసేపు కూర్చోవడం, ఎత్తైన దిండు వాడటం, నిద్ర లేకపోవడం, గాయాలు, వెన్నెముక సంబంధిత సమస్యలు, బరువులు ఎత్తడం వంటివి మెడ నొప్పికి కారణం కావచ్చు. అకస్మాత్తుగా వచ్చిన కండరాల నొప్పులు కూడా ఈ సమస్యను పెంచుతాయి.

మెడ నొప్పి తేలికపాటిది కావచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన స్థాయికి వెళ్తుంది. మెడ కదలడంలో ఇబ్బంది, బిగుసుకుపోవడం, కత్తిపోటులాంటి నొప్పి అనుభూతి, తల కదిలించేటప్పుడు అసౌకర్యం, భుజం నుంచి చేతులకూ వ్యాపించే నొప్పి, తిమ్మిర్లు, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిరంతరంగా నొప్పి ఉంటే డాక్టర్‌ ను కలవడం అవసరం. అయితే చిన్నపాటి లక్షణాలకు ఇంట్లోనే పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.

మెడకు హాట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ వేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. వేడి నీరు కండరాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఐస్ వాడటం వల్ల నొప్పి తగ్గుతుంది. బట్టలో ఐస్ క్యూబ్స్ పెట్టి వాడవచ్చు. వేడి నీటిలో తడిపిన బట్టను మెడపై పెట్టడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.

నెమ్మదిగా మెడను కదిలించడం, వంచడం, చుట్టేసేలా కదలికలు చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా నెమ్మదిగా చేయాలి. నొప్పి ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపిస్ట్‌ ను సంప్రదించడం మంచిది.

మెడ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రపోతున్నప్పుడు ఎత్తైన దిండు వాడటం మానేయాలి. పని చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో కాసేపు నిలబడటం మంచిది. అలాగే మీరు కూర్చునే కుర్చీ సౌకర్యవంతంగా ఉందో లేదో చూసుకోండి, మెడపై అనవసరమైన ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడండి. వేసవిలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి, నీరు ఎక్కువగా తాగడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మెడ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మెడ నొప్పి సాధారణ సమస్య అయినా ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా డాక్టర్‌ ను కలవాలి. ఇంట్లో అనవసరంగా పరీక్షలు చేయకుండా నేరుగా నిపుణుడిని సంప్రదించాలి. నొప్పికి అసలు కారణం తెలుసుకొని సరైన చికిత్స పొందడం అవసరం. సమయానికి తీసుకునే జాగ్రత్తలు మిమ్మల్ని తీవ్రమైన సమస్యల నుండి కాపాడుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)