AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: మెదడు మస్తు పని చేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా ఇలా చేయండి..!

మన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే రోజూవారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మానసికంగా యాక్టివ్‌ గా ఉండాలంటే మెదడుకు సరైన శిక్షణ, వినోదం, విశ్రాంతి అవసరం. ఈ అలవాట్లు మన జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇప్పుడు అలాంటి 6 ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకుందాం.

Brain Health: మెదడు మస్తు పని చేయాలన్నా,  జ్ఞాపకశక్తి పెరగాలన్నా ఇలా చేయండి..!
Healthy Brain
Prashanthi V
|

Updated on: May 26, 2025 | 12:58 PM

Share

ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేయడం ద్వారా మెదడు ఆలోచనలను స్పష్టంగా ఉంచుతుంది. ఈ ప్రశాంతత వల్ల మన జ్ఞాపకశక్తి బలంగా మారుతుంది. ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ధ్యానం చేయడం మంచిది.

ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం, తెలుసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. ఇది ఒక వ్యాయామం లాంటిది. సంగీతం నేర్చుకోవడం, కొత్త భాషలపై ఆసక్తి చూపించడం, కొత్త విషయాలను చదవడం వల్ల మన మెదడు పదునుగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి స్థిరంగా ఉంటుంది.

మంచి నిద్ర మన మెదడుకు చాలా అవసరం. ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవడం తప్పనిసరి. నిద్ర సరిపోకపోతే మానసిక సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. పడుకునే ముందు నెమ్మదిగా పాటలు వినడం, మొబైల్‌ ను దూరంగా పెట్టడం వంటి చిన్న మార్పులు బాగా సహాయపడతాయి.

చిన్న విషయాలను పెద్దవిగా భావించకుండా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీని కోసం యోగా, మైండ్‌ఫుల్‌నెస్, ప్రాణాయామం వంటి పద్ధతులు మంచివి. మనం చేసే పనుల పట్ల ఆనందాన్ని పొందడం, మనసును సానుకూలంగా ఉంచుకోవడం మెదడుకు శక్తిని ఇస్తాయి. ఒత్తిడి తగ్గితే జ్ఞాపకశక్తి సహజంగా మెరుగుపడుతుంది.

మెదడు ఆరోగ్యానికి మంచివైన కొన్ని ఆహార పదార్థాలను రోజూ తినాలి. ఆకుకూరలు, బాదం, వాల్‌ నట్, సన్‌ ఫ్లవర్ విత్తనాలు, బ్లూబెర్రీస్, క్వినోవా లాంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ తీపి పదార్థాలు తగ్గించాలి.

కేవలం శరీరానికి మాత్రమే కాకుండా.. మెదడుకు కూడా వ్యాయామం అవసరం. సుడోకు, చెస్, మెమొరీ గేమ్స్, పజిల్స్ వంటి ఆటలు మెదడు బాగా పని చేసేలా చేస్తాయి. ఇవి ఆలోచనా సామర్థ్యాన్ని, విషయాలను గుర్తించే శక్తిని మెరుగుపరుస్తాయి. తరచుగా ఈ రకమైన ఆటలు ఆడటం వల్ల మెదడు పదునుగా ఉంటుంది.

జ్ఞాపకశక్తి బలంగా ఉండాలంటే చిన్న చిన్న అలవాట్లు చాలా అవసరం. ఈ ఆరు చిట్కాలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే మీ తెలివితేటలు, చురుకుదనం, ఏకాగ్రత అన్నీ మెరుగుపడతాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమానంగా శ్రద్ధ వహించాలి.