తీవ్రమైన కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి.. వెంటనే రిలీఫ్ గా ఉంటుంది..!
వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా కీళ్ల నొప్పులు రావచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఎక్కువ బరువు, యూరిక్ యాసిడ్ పెరగడం, సరైన పోషకాలు తీసుకోకపోవడం వంటివి. నొప్పి మందులకు బదులుగా సహజమైన ఆయుర్వేద పద్ధతులు వాడితే సురక్షితంగా ఎక్కువ కాలం ఉపశమనం పొందవచ్చు.

కీళ్ల నొప్పుల బాధను పూర్తిగా తగ్గించుకోవడానికి ఆయుర్వేద పద్ధతులు చాలా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. దీనికి కారణాలు జీవనశైలిలో లోపాలు, ఎక్కువ బరువు, సరైన పోషకాలు లేకపోవడం, యూరిక్ యాసిడ్ పెరగడం, కీళ్లకు దెబ్బతగలడం వంటివి. కీళ్ల నొప్పులు మీ రోజువారీ పనులను అడ్డుకోవచ్చు. చాలా మంది నొప్పి తగ్గించే మందులు వాడుతుంటారు. కానీ వాటిని ఎక్కువ కాలం వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే సహజమైన, సురక్షితమైన ఆయుర్వేద పద్ధతులను పాటించడం మంచిది.
అల్లం
అల్లంలో వాపును తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఇది కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతుంది. అల్లం టీ తాగవచ్చు లేదా అల్లం నూనెతో నొప్పి ఉన్నచోట మెల్లగా మసాజ్ చేసుకోవచ్చు.
ఆవాల నూనె
ఆవాల నూనె శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలను చిన్నగా చేసి ఆవాల నూనెలో వేడి చేసి నొప్పి ఉన్న కీళ్లపై మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి నొప్పిని తగ్గిస్తుంది.
మెంతి వేరు
మెంతి వేరులో సహజంగా వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి వేరు పొడిని వేడి నీటిలో కలిపి తాగవచ్చు. అలాగే కొద్దిగా మెంతి వేరును ఆముదం నూనెలో వేయించి నొప్పి ఉన్నచోట రాయవచ్చు.
అశ్వగంధ
ఈ మూలికలో వాపును తగ్గించే మంచి గుణాలు ఉంటాయి. ఇది నొప్పిని తగ్గించి కీళ్ల కదలికను సులభం చేస్తుంది. అశ్వగంధను మాత్రల రూపంలో లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. నిపుణుల సలహాతో మాత్రమే దీనిని వాడడం మంచిది.
ఆముదం వేరు
కీళ్ల నొప్పులకు ఆముదం వేరును చాలా కాలం నుండి వాడుతున్నారు. ఆముదం వేరును నీటిలో కలిపి తాగడం లేదా నూనెలో వేయించి నొప్పి ఉన్నచోట రాయడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి.
పసుపు
పసుపులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో వాపును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజు రాత్రి వేడి పాలలో అర చెంచా పసుపు కలిపి తాగడం వల్ల నొప్పులపై మంచి ప్రభావం ఉంటుంది.
వాము
వాము జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వాముని నీటిలో మరిగించి తాగవచ్చు లేదా వాము నూనెను నొప్పి ఉన్నచోట రాయవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




